జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎల్లకాలం చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తుంటారనే ఆరోపణలకు కొదవలేదు. ఈవిషయంలో పవన్ ఎంతగింజుకున్నా, ఎంత కాదన్నా మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం అంగీకరించటంలేదు. గతంలో ఏమి జరిగింది అన్నది వదిలేస్తే తాజాగా కందుకూరులో జరిగిన ఘటనపై  స్పందించిన విధానంతో పవన్ పై మంత్రుల ఆరోపణలు నిజమనే భావన అందరిలోను పెరిగిపోతోంది.





ఇంతకీ ఘటనకు సంబందించి  పవన్ ఏమన్నారంటే జరిగిన ప్రమాదం దురదృష్టకరమట. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్నట. అలాంటి కార్యకర్తలు ప్రమాదంలో మరణించటం విచారకరమన్నారు. చనిపోయినవారి ఆత్మలకు శాంతి కలగాలట. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారట. ఇది పవన్ జారీచేసిన ప్రెస్ నోట్. ఇలాంటి ఘటనే జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో కానీ లేదా వైసీపీ కార్యక్రమంలో జరిగుంటే పవన్ స్పందన ఇలాగే ఉండేదా ?





జగన్ మీద ఏ రేంజిలో రెచ్చిపోయుండేవారో అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా జగన్ తో పాటు ప్రభుత్వాన్ని కూడా చెడుగుడు ఆడేసుండేవారు. బాధితులపక్షాన ప్రభుత్వం ముందు చాలా డిమాండ్లు పెట్టుండేవారు. కానీ ఇక్కడ ప్రమాదంజరిగి 8 మంది చనిపోయింది చంద్రబాబు కార్యక్రమంలో కదా. అందుకనే ప్రెస్ నోట్లో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావన లేకుండా జాగ్రత్తపడ్డారు. ప్రమాదానికి కారణం చంద్రబాబే అంటు బాధిత కుటుంబాలు మండిపోతుంటే ఈ దిశగా పవన్ ఒక్కమాట కూడా మాట్లాడలేదు.





ప్రమాదానికి కారణం తెలుగుదేశంపార్టీ నేతలే అని మృతుల కుటుంబసభ్యులతో పాటు స్ధానికులు ఆరోపిస్తున్నారు. మరీ విషయమై పవన్ తన ప్రెస్ నోట్లో చంద్రబాబు లేదా తెలుగుదేశంపార్టీ నేతలని ఒక్కమాట కూడా తప్పుపట్టలేదు. ప్రెస్ నోట్లో తెలుగుదేశంపార్టీ నిర్వహించిన సభ అని చెప్పారేకానీ చంద్రబాబు ప్రస్తావనే తేలేదు. దీంతోనే చంద్రబాబు ప్రయోజనాలను రక్షించేందుకే పవన్ 24 గంటలూ పనిచేస్తుంటారనే మంత్రుల ఆరోపణలు నిజమే అని జనాలు అనుకునేందుకు అవకాశం దొరికింది. తనపైన పడిన ముద్రను తుడిపేసుకునేందుకు పవన్ కూడా ప్రయత్నించటంలేదు. అందుకనే పవన్ అంటే చంద్రబాబు మనిషే అనే ముద్రపడిపోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: