కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ తర్వాత మారు మోగిపోతున్న సంగతి తెలిసిందే. అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యర్థుల మీద సింహంలా గర్జించే మాటలతో మీద పడిపోతూ ఉంటే... మన నెల్లూరు రురల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం సొంత ప్రభుత్వంలో ఉన్న అధికారులు మరియు ప్రభుత్వంపైన తన మాటలతూటాలతో విరుచుకుపడుతున్నాడు. అయితే ఇదేమీ కొత్తగా తనలో వచ్చిన మార్పు కాదు, తాను ప్రతిపక్షములో ఉన్నప్పుడు కూడా అధికారులపై ఆలాగే అధికార ప్రభుత్వంపై ప్రజల కోసం చెలరేగి మాట్లాడే అలవాటుంది. ఈయన వైఖరే తనకు ప్రత్యేక అభిమానులు ఏర్పడేలా చేసింది.

ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల చేత ఎన్నిక కబడడం వలన వారితో ప్రత్యేక అనుబంధాన్ని పెట్టుకున్నాడు శ్రీధర్ రెడ్డి. అందుకే తన నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను పిలిచి మరీ అడిగేస్తాడు. అయితే ఇది అలా ఇలా వెళ్లి ఏకంగా తన సొంత పార్టీ పాలనపైనే రెచ్చిపోయేలా చేసింది. ఫలితంగా సీఎం ఆఫీస్ నుండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి నిన్న ఫోన్ వచ్చింది.. సోమవారం అనగా ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు కలవాలని సూచించారు. అందులో భాగంగానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ను కలిశారు.

అయితే వీరిద్దరి మధ్యన ఏమి జరిగింది ? జగన్ శ్రీధర్ రెడ్డి పై ఫైర్ అయ్యారా లేదా మంచిగానే ఎలా మెలగాలో సెలవిచ్చారా అన్నది తెలియదు. మొత్తానికి శ్రీధర్ రెడ్డిని పిలిపించుకోవడం ద్వారా పార్టీలో పార్టీ మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైరెక్ట్ గా లేదా ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసే వారికి ఒక హెచ్చరిక అని చెప్పాలి. ఈ సంఘ్తన తర్వాత అయినా సో కాల్డ్ నాయకులు సొంత పార్టీని విమర్శించడం ఆపుతారా  చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: