నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డిపై ఆపరేషన్ స్టార్టయ్యింది. కార్పొరేటర్ విజయ్ భాస్కరరెడ్డి ఫిర్యాదుపై పోలీసులు ఎంఎల్ఏపైన కేసు నమోదుచేశారు. తన బెదిరించారని, కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఎంఎల్ఏపై  కార్పొరేటర్ ఫిర్యాదుచేశారు. ఐదురోజులుగా కోటంరెడ్డి కేంద్రంగా జిల్లా పాలిటిక్స్ చాలా హాటుహాటుగా జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీలో తనకు అవమానాలు ఎదురవుతున్నాయని, తన ఫోన్ ట్యాపింగ్ చేయించారని కోటంరెడ్డి చేసిన గోల సంచలనమైంది.





కోటంరెడ్డి ఆరోపణలపై మంత్రులు, వైసీపీ నేతలు కూడా అంతే ధీటుగా ఎదురుదాడులు మొదలుపెట్టారు.  ఈ గోల ఇలా నడుస్తుండగానే వచ్చేఎన్నికల్లో తాను టీడీపీ తరపున పోటీచేయబోతున్నట్లు ఎంఎల్ఏ చెప్పటంతో కలకలం రేగింది. అంటే ముందుగానే చంద్రబాబునాయుడుతో టికెట్ పై హామీ తీసుకునే కోటంరెడ్డి వైసీపీపై బురదచల్లటం మొదలుపెట్టారంటు మంత్రులు తీవ్రంగానే ఆరోఫణలు గుప్పిస్తున్నారు.





ఈ నేపధ్యంలోనే కోటంరెడ్డి పార్టీ మారితే ఆయనతో ఎవరెవరు వెళిపోతారనే విషయమై చర్చలు మొదలయ్యాయి. నెల్లూరు కార్పొరేషన్లోని చాలామంది కార్పొరేటర్లు కోటంరెడ్డికి మద్దతుగా నిలుస్తారని అనుకున్నారు. అయితే నలుగురు కార్పొరేటర్లు తాము కోటంరెడ్డితో వెళ్ళేదిలేదని, పార్టీలోనే కంటిన్యు అవుతామని స్పష్టంచేశారు. వీరిలో విజయ్  కూడా ఉన్నారు. అంతేకాకుండా పార్టీ డివిజన్ ఆఫీసులో కోటంరెడ్డి ఉండే ఫెక్సీలను విజయ్ తొలగించారట. అందుకని కోటంరెడ్డి మద్దతుదారులు కార్పొరేటర్ పై దాడికి దిగటమే కాకుండా కిడ్నాపుకు కూడా ప్రయత్నించినట్లు గోల మొదలైంది. జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేద్దామని ప్రయత్నించటంలో చివరకు కోటంరెడ్డే ఇబ్బందులు పడే పరిస్ధితి ఎదురవుతున్నట్లుంది.





ఎంఎల్ఏ ఆదేశాలతోనే తనపై కొందరు దాడిచేసి కిడ్నాపు చేయటానికి ప్రయత్నించినట్లు విజయ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఫిర్యాదు ఆధారంగా కోటంరెడ్డి అండ్ కో పై పోలీసులు 448, 363 సెక్షన్ల కింద కేసుపెట్టారు. ఎలాగూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంఎల్ఏ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి, ఇపుడు కేసులు పెట్టిన నేపధ్యంలో కచ్చితంగా యాక్షన్ ఉంటుందనే అనుకుంటున్నారు. ఎంఎల్ఏని గనుక పోలీసులు అరెస్టు చేస్తే వివాదం ఊహిచని మలుపు తిరిగే అవకాశముంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: