భారతదేశాన్ని అహర్నిశలూ కంటికి రెప్పలా కాపాడుతున్న సైన్యంపై కంటికి కనిపించని మహమ్మారి పగబట్టింది. ఉగ్రమూకల్ని చీల్చిచెండాడే మన సైనికులు ఆ వైరస్ భారిన పడి ఆస్పత్రిపాలవుతున్నారు. అందుకు నిదర్శనం ఢిల్లీలోని సీఆర్ పీఎఫ్ బెటాలియన్ లో 122మందికి పైగా జవాన్లకు కరోనా వైరస్ సోకడమే. ఆ సైనికులను మండోలిలోని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. 

 

దేశరాజధానిలోని మయూర్ విహార్ లో ఇటీవల కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కేవలం ఈ ప్రాంతంలోనే 52మందికి పైగా ఈ మహమ్మరి సోకింది. దీంతో అలర్టయిన అధికారులు.. కరోనా వైరస్ అంతం చూసేందుకు సిద్ధమయ్యారు. వైరస్ నిర్ధారణ పరీక్షలను వేగవంతం చేశారు. వైరస్ లక్షణాలున్న బాధితులను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

 

ఈ సీఆర్ పీఎఫ్ బెటాలియన్ లో దాదాపు 11వందల మంది జవాన్లు ఉన్నారు. వీరిలో 122 మందికి పైగా వైరస్ అటాక్ అయింది. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. ఈ జవాన్లతో సన్నిహితంగా మెలిగిన వారందరినీ క్వారంటైన్ కు తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ మొదటి వారంలో 55ఏళ్లర వయసున్న ఓ ఎస్ ఐ కరోనా వైరస్ దెబ్బకు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో సెలవుపై ఇంటికి వెళ్లొచ్చిన కానిస్టేబుల్ నుంచి సైతం మిగతా సిబ్బందికి వైరస్ అటాక్ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 

 

ఒక్క బెటాలియన్ నుంచి వందకు పైగా కేసులు నమోదుకావడంతో.. కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై సీఆర్ పీఎఫ్ నుంచి హోం శాఖ వివరణ కూడా కోరింది. కరోనా ప్రభావంతో సీఆర్ పీఎప్ పగడ్బంధీ చర్యలు చేపట్టింది. అన్ని బెటాలియన్లలో పగడ్బంధీగా శానిటైజేషన్ చేస్తోంది. అంతేకాదు వాహనాల శుభ్రత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: