ప్రస్తుతం పాకిస్థాన్ లో  పరిస్థితి రోజు రోజుకు హాట్ హాట్ గా  మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజల్లో  రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడుతోంది ముఖ్యంగా గిల్గిట్ బాల్టిస్థాన్, బెలూచిస్తాన్, సింధు ప్రాంతాల ప్రజలు పాకిస్థాన్ ప్రభుత్వానికి తీరుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడుతున్నారు. ఇక ప్రజలు చేపట్టిన ఉద్యమాలకు  అటు ప్రతిపక్ష పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ప్రతిపక్షాలు కూడా ప్రజలకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటిస్తూన్న  నేపథ్యంలో అటు సైన్యంలోని ఒక వర్గం కూడా ప్రస్తుతం ప్రజలకు అండగా నిలబడేందుకు సిద్ధమైంది అనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వరుసగా పాకిస్తాన్ ఆర్మీ తో ఐఎస్ఐతో సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల ప్రజలు ఉద్యమాలు చేపట్టి భారత సహాయం చేయాలి అంటూ కోరుతున్నారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్  సమావేశాలు చర్చనీయాంశంగా మారగా..  భారత్ కూడా సర్వ సన్నద్ధమవుతోంది.


 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో భారత్ పై  పాకిస్థాన్ సైన్యం దాడి చేసే అవకాశం ఉంది అని భావించిన భారత సైన్యం సర్వ సన్నద్ధమవుతోంది. ఈక్రమంలోనే తట్టపాని సెక్టార్లో భారత్ వైపు దూసుకొస్తున్న పాకిస్తాన్ డ్రోన్ లను కూల్చి వేసింది భారత ఆర్మీ. అంతేకాకుండా భారత్ పాకిస్తాన్ సరిహద్దు లోకి భారీగా సైన్యాన్ని కూడా మోహరించింది. అంతేకాకుండా కరాచీ పోర్టు కి  ఎదురుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాలకి ఇవతల వైపున ఉన్నటువంటి అంతర్జాతీయ జలాల్లో  ప్రస్తుతం భారత్ యుద్ధ నౌకలను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: