
కానీ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను మాత్రం అడ్డంకి గా మారింది షర్మిల.. ఎన్నికలలో గోరంగా ఒటమి తర్వాత వైయస్ జగన్ ని మాత్రమే షర్మిల విమర్శిస్తూనే ఉన్నది. కూటమి ప్రభుత్వాన్ని మాత్రం ఏ విధంగా ప్రశ్నించకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా మాట్లాడుతున్నారనే విధంగా విమర్శలు వినిపిస్తున్నాయి. పల్నాడులో కేవలం 100 మందికి మాత్రమే పర్యటన ఇచ్చిన కూటమి ప్రభుత్వం అంతమంది వెళుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించింది. ముఖ్యంగా జగన్ పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు.
అయితే ఈ విషయంపై అటు కూటమి నేతలు స్పందించక ముందే ముందుగానే షర్మిల తన అన్న పైన విషం చిమ్మడానికి సిద్ధమయ్యింది.. ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ ప్రశ్నించడం జరిగింది.. మీ ఉనికి కోసమే జనాలను టైర్ల కింద తొక్కుకుంటూ వెళ్లిపోతారా అంటూ ప్రశ్నించింది. మీరు ఇలాంటి శవ రాజకీయాలు చేస్తున్నారా? ఇదెక్కడ రాక్షస ఆనందం అంటూ తన అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది షర్మిల. అయితే ఈ విషయం పైన పలువురు నేతలు కార్యకర్తలు కూటమి ఏడాది పాలన ప్రభుత్వ వైఫల్య పైన ప్రశ్నించారు కానీ అన్న పైన వ్యక్తిగతంగా విద్వేషాన్ని చూపడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకొని వాడుకుంటుంది అంటూ సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే చాలామంది నేతలు కూడా షర్మిలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి తప్పించాలని ఫిర్యాదులు వెళుతున్నాయి.