పాన్ కార్డు.. ఆర్థిక లావాదేవీల్లో అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. పన్నుల చెల్లింపు, డిపాజిట్లు, విత్‌డ్రా, ఫిక్స్డ్ డిపాజిట్లు, లోన్స్ వంటి బ్యాంకింగ్ లావాదేవీల‌కు, ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల‌కు, షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు, పాస్ పోర్ట్ అప్లికేషన్ కు, వాహనాల రిజిస్ట్రేషన్ కు ఇలా చెప్పుకుంటే పోతే చాలా అంశాల్లో పాన్ కార్డు అనేది కీల‌కంగా మారిపోయింది. అయితే జూలై 1 నుంచి పాన్ కార్డు విష‌యంలో కొత్త రూల్ అమ‌ల్లోకి వ‌చ్చింది.


కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల‌ని భావించేవారు ఈ రూల్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాలి. ఇన్నాళ్లు డ్రైవింగ్ లైసెన్స్ లేదా జనన ధృవీకరణ పత్రం వంటి గుర్తింపు కార్డులను రుజువు చూపించి పాన్ కార్డును పొందే అవ‌కాశం ఉండేది. కానీ, ఇక‌పై ఆ ఛాన్స్ లేదు. కొత్తగా పాన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసే వారు క‌చ్చితంగా తమ ఆధార్‌ను వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సిందే.


ఈ విష‌యాన్ని తాజాగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం నుండి ఈ నిబంధన అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేసింది. అలాగే ఆల్రెడీ పాన్ కార్డు క‌లిగి ఉన్న వారు ఈ ఏడాది డిసెంబర్ 31 లోగా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవాలని సీబీడీటీ పేర్కొంది. ఒక‌వేళ ఈ నిబంధన పాటించ‌కుంటే పాన్ కార్డులు డి-యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంద‌ని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి హెచ్చ‌రించింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: