
జనసేన పార్టీ ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించిన లోకం మాధవి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. నెల్లిమర్ల శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెకు టిడిపి నేతలతో ఆమెకు సఖ్యత లేదు. ఐటీ రంగంలో అంతర్జాతీయంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న మాధవి తరచూ విదేశాల్లో ఉండడం, నియోజకవర్గానికి తక్కువ సమయంలో అందుబాటులో ఉండడం రాజకీయంగా విమర్శలకు దారితీస్తోంది. ఇదే సమయంలో టిడిపి నాయకులు ఆమె నియోజకవర్గంలో స్వయంగా కార్యకలాపాలు చేపడుతుండడం ఈ వివాదానికి నిప్పు రేగించింది.
గత ఐదు రోజులుగా నెల్లిమర్లలో “సుపరిపాలనలో తొలి అడుగు” అనే కార్యక్రమం టిడిపి చేపట్టింది. ఇది చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని టిడిపి నిర్వహించడం, ఈ విషయంపై మాధవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. “నా నియోజకవర్గంలో మీ పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు? ఇది మా పార్టీకి సంబంధించదూ,” అంటూ ఆమె స్థానిక టిడిపి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి అచ్చెం నాయుడు ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. “జనసేన ఎమ్మెల్యే అయినా మా పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం పనులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని ఆమె తప్పుపడుతున్నారు,” అని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, చర్చించి పరిష్కరించుకుందామని సూచించారు. గతంలోనూ జనసేన–టిడిపి మధ్య నెల్లిమర్లలో అభిప్రాయ భేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో చంద్రబాబు, నారా లోకేష్ జోక్యం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ ఇప్పటి వివాదం మరింత తీవ్రంగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు