
ఇక అలాగే రేపు జలవనుల శాఖ పైన చర్చించబోతున్నారు. ఈనెల 22వ తేదీన శాంతిభద్రతల విషయంపై ,23న వైద్య ఆరోగ్యం, 24వ తేదీన పరిశ్రమలకు సంబంధించి, 25న సూపర్ సిక్స్ పథకాలు, 26వ తేదీన క్వాంటం, 27వ తేదీన లాజిస్టిక్, 29వ తేదీన స్వర్ణాంధ్ర దిశగా ఏపీ, 30వ తేదీన రాయలసీమ కోస్తా ఉత్తరాంధ్ర అభివృద్ధిపైన ప్రత్యేకించి మరి చర్చించబోతున్నారు. ఇక ఈనెల 20, 21, 28 తేదీలలో అసెంబ్లీకి హాలిడే.
వాహన మిత్ర పథకం కింద ఈ దసరాకి ఆటో కలిగే ఉన్న డ్రైవర్లకు రూ .15వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రతిపాదనను ఆమోదం తెలుపనున్నారు.
అలాగే ప్రభుత్వ భవనాల పైన, గ్రామస్థాయిలో పంచాయతీ భవనాలపైన సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ ,ఎస్టీ వినియోగదారుల పైన ఎలాంటి విద్యుత్ ఛార్జీల భారం పడకుండా అర్హులైన వారందరికీ కూడా ఉచితంగానే ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేయబోతుందట.
వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా చర్చించే విధంగా అసెంబ్లీలో నిర్ణయాలు తీసుకోబోతోంది ఏపీ ప్రభుత్వం. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా అసెంబ్లీ సమావేశాలు జరపాలంటూ బీఏసీ నిర్ణయం తీసుకుంది.