ఒకప్పుడు అమెరికా అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయిస్తామని, మాది అగ్రరాజ్యం అని విర్రవీగేది. మరీ ముఖ్యంగా భారత్ ను వణికిస్తామని, అంత పెద్ద దేశం మాకు భయపడిపోతుందని చెప్పుకుంటూ ఉండేది. అలాంటి అమెరికాకు ప్రస్తుతం భారత్ నుంచి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేవలం అమెరికా కాదు చైనా లాంటి దేశాలను కూడా భారత్  పక్కకు నెట్టేస్తోంది.. ఇంత శక్తివంతంగా ఎదగడానికి కారకుడు ఎవరయ్యా అంటే ది గ్రేట్ నరేంద్ర మోడీ.. మరి ఆయన ఏం చేస్తున్నారో ఆ వివరాలు చూద్దాం.. ఒకప్పుడు చైనా మన దేశం మీదికి యుద్ధానికి వస్తే లొంగిపోయామని ఒప్పుకొని 35000 కిలోమీటర్ల భూభాగాన్ని వదిలేసిన మహానుభావుడు జవహర్లాల్ నెహ్రూ.. అదే సమయంలో భారత్ లోని చాలామంది కమ్యూనిస్టులు చైనా అంటే భారత్ కు భయం అంటూ ప్రచారం చేశారు.

  అలాంటి పరిస్థితుల నుండి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రధాని నరేంద్ర మోడీ బయటపడేసారని చెప్పవచ్చు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత అమెరికాతో స్నేహం రష్యాతో స్నేహం చైనా తో కూడా స్నేహం ఏర్పడింది. అలాగని వారికి భయపడేది కూడా లేదు. డోక్లాంలో చైనా వాళ్ళని తరిమి పంపించడం కూడా మోడీతోనే అయింది. గాల్వాన్ లోయలో నిలదీయడం కూడా  మోడీ ప్రభుత్వం చేసిన ఘనత అని చెప్పవచ్చు. ఈ సమయంలో భారత్ పై యుద్ధం ప్రకటిస్తామని చైనా అధ్యక్షుడు జంపింగ్ ప్రకటించిన కానీ యుద్ధానికి సాహసించలేదు. ఎందుకంటే భారత్ సైన్యం ఎలా ఉంటుందో ఎంత శక్తివంతమైందో  ఆయనకి పూర్తిగా తెలుసు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు భయపెడితే భయపడ్డారు కదా ఇప్పుడు కూడా భయపడతారని ఆయన అలా గంభీర ప్రకటనలు చేశారు. కానీ నరేంద్ర మోడీ ఏమాత్రం భయపడిపోకుండా సైన్యానికి అండగా నిలుస్తూ వచ్చారు.

ప్రపంచ దేశాలని కంట్రోల్ చేసిన శక్తి మోడీకి మాత్రమే దక్కింది. ఇక చైనా పక్కకు జరిగిన తర్వాత అమెరికా ఆధిపత్యం చెలాయించాలని చూసింది. దేశంపై సుంకాలు విధించింది.ఆయిల్ రష్యా నుంచి కొనద్దని అమెరికా ఇండియా పై కక్ష కట్టింది. అయినా మోడీ మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొని అమెరికాకు చెంపపెట్టులా మారారు. అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసినా గడ్డి పరకాల తీసేశారు. ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ శక్తివంతమైన నేత అని సింగపూర్ మాజీ విదేశాంగ మంత్రి జార్జ్  యో స్టేట్మెంట్ ఇచ్చారు. భారత్ అమెరికాకు అగైనెస్ట్ గా బలంగా నిలబడిందని, ఎన్ని ఎత్తులు వేసిన దాన్ని తిప్పి కొట్టిందని చివరికి ఆయనే లొంగిపోవాల్సి వచ్చిందని తెలియజేశారు. ఈ విధంగా నరేంద్ర మోడీ అమెరికాను తన దారిలోకి ఏ విధంగా తెచ్చుకోవాలో ఆ ప్లాన్ ప్రకారం తెచ్చుకొని తన శక్తి ఎంతో నిరూపించారని ఆయన  ప్రశంసలు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: