ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టు చుట్టూనే గత కొన్నేళ్లుగా తిరుగుతోంది. ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వారు మేము పూర్తి చేస్తామంటే చెబుతున్నారు.. 2014 లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ అలాగే చెప్పిన..2019 లో టిడిపి పార్టీ కూడా అదే చెప్పింది..కాని 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని అమరావతిని, పోలవరం పూర్తి చేసి తీరుతామంటూ సీఎం చంద్రబాబు తెలియజేశారు. కానీ పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పనులు పూర్తి చేయలేదని విధంగా కేంద్రమంత్రి తెలియజేయడంతో అసలు విషయం బయటపడింది.


రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి( నిమ్మల రామానాయుడు) ను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ప్రశ్నించారు. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో రూ. 5,052.71 కోట్ల రూపాయలను అడ్వాన్స్గా ఇచ్చాము వాటికి సంబంధించి SNA ఖాతాలో జమ చేసి ప్రాజెక్టుల పనులకు వాడాలని తెలియజేశామని తెలిపారు. అలాగే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలలో వారికి పునరావాస కాలనీ పనులు, వారి యొక్క భూములకు సంబంధించి పరిహారం చెల్లించి, వారికి కావలసిన అన్ని సదుపాయాలని చూడాలని డబ్బులు  ఇచ్చినా కూడా పనులను వేగవంతం చేయలేదంటూ ప్రశ్నించారు.


కేంద్రం అడ్వాన్స్ ఇచ్చిన కూడా ఆ డబ్బులను ఎక్కడ డైవర్ట్ చేశారు? ఎవరికోసం డైవర్ట్ చేశారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పోలవరం ప్రాజెక్టు పనులు 2027 నాటికి పూర్తి చేసేలా నిధుల కొరత ఉండకుండా పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం 2024-2025 లో రెండు విడతలలో రూ. 5,052.71 కోట్ల రూపాయలను అడ్వాన్స్గా ఇచ్చామని,ఆ నిధులను SNA ఖాతాలో జమచేసి పోలవరం పనులకు మాత్రమే ఉపయోగించాలని చెప్పిన,మీ అవసరాలకు మళ్లించుకుంటూ పోతే  ఇలాగైతే అనుకున్న గడువులోపు పోలవరం ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ నిలదీశారు. దీంతో రూ. 1,107,62 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు  నిలిచిపోయాయని తెలియజేశారు. అలాగే ఇచ్చిన నిధులకు సంబంధించి పూర్తి ఆధారాలతో సమర్పిస్తేనే రూ. 5,936 కోట్ల రూపాయలను విడుదల చేస్తామంటూ కేంద్ర శాఖామంత్రి సిఆర్ పాటిల్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: