ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది..!


దీని అర్థం ఏమిటంటే.. ఓర్పు అనేది కొంత వరకు మాత్రమే ఉండాలి. ఒకవేళ మితిమీరిన ఓర్పు గనుక ఉంటే అది పిరికితనం అవుతుంది. ఎవరైతే ఎక్కువ ఓపికతో ఉంటారో,  ఈ లోకం వారిని సహనశీలి అని సంబోధించకపోగా పిరికివారి కింద లెక్క కడుతుంది. కాబట్టి సహనానికి కూడా కొంచెం హద్దు అనేది ఉంటుంది. ఏదీ ఏమైనా సహనం ఎదుటివారికి పిరికితనం లాగా కనిపించకూడదు. ఒకవేళ అతి ఓర్పు ఎదుటివారికి పిరికితనం గా కనిపిస్తుంది .. అని దీని అర్థం.


ఉదాహరణకు మీరు ఏ ఒక్కరి దగ్గరైనా సహనంగా, ఓర్పుగా ఉంటారో, వారు మిమ్మల్ని పిరికి వారిగా భావిస్తారు. వారు మీ మంచితనాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఒకవేళ మీరు సహనం కోల్పోయినప్పుడు ఎంత మంచి గా ఉన్నప్పటికీ ఆ క్షణం శత్రువులు గా మారక తప్పదు. కాబట్టి అతి వినయం, అతి సహనం రెండూ ప్రమాదకరమే. ఏ విషయంలోనైనా సరే కొంతవరకు మాత్రమే ఓపిక ఉండాలి. అంతేకానీ ఏం జరిగినా సరే మీలోని భావోద్వేగాలను అనచుకొని సహనంగా ఉంటే మాత్రం అప్పుడు వారికి పిరికివాళ్ళ లాగా కనిపిస్తారు. కాబట్టి అతి ఓర్పు పిరికివాడి కింద లెక్క ..

మరింత సమాచారం తెలుసుకోండి: