ఇటీవల కాలంలో భారత జట్టులో వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్న  యువ ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది అయితే డబుల్ సెంచరీలు కూడా చేసి ప్రపంచ రికార్డులు కొల్లగొడుతూ ఉండడం గమనార్హం. మొన్నటికి మొన్న ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.  అయితే ఈ డబుల్ సెంచరీ గురించి ప్రేక్షకులు మరిచిపోక ముందే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో అటు శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే.


 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఏకంగా 208 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు శుభమన్ గిల్. తద్వారా ఇక ప్రపంచ రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన బ్యాటింగ్ గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో ఇటీవల శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేసిన నేపథ్యంలో ఇక వన్డే ఫార్మాట్లో ఇప్పుడు వరకు శుభమన్ గిల్ సెంచరీ కొట్టిన వీరులు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 ఆ లిస్టు చూసుకుంటే ఇప్పటివరకు డబుల్ సెంచరీ కొట్టిన వారిలో ప్రపంచ క్రికెట్లో అటు భారత్ జట్టు తరఫున ఆడిన ఆటగాళ్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇక ఆ లిస్టు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ 200 పరుగులు, వీరేంద్ర సెహ్వాగ్ 219, రోహిత్ శర్మ 208, 209, 264.. మార్టిన్ గప్తిల్ 237, క్రిస్ గేల్ 215, ఫకర్ జమాన్ 201, ఇషాన్ కిషన్ 210, శుభమన్ గిల్ 208 పరుగులు తో ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ వీరులుగా కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్న కేవలం కొంతమందికి మాత్రమే ఈ అరుదైన ఫీట్ సాధ్యం అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil