సాదరణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో యువ ఆటగాళ్లు కోట్ల రూపాయల ధర దక్కించుకోవడం ఎప్పుడూ చూస్తూ ఉంటాము. ఇక ప్రతి ఏడాది కూడా కొత్త ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోకి వస్తూ ఉంటారు. ఇలా ఐపిఎల్ టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించే తమ పేరును దరఖాస్తు చేసుకొని ఇక తమ ఆట తీరుతో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించి ఇక కోట్ల రూపాయల ధర కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి.



 అయితే ఇక ఐపీఎల్ లో ఎవరైనా యువ ఆటగాడికి ఫ్రాంచైజీలు పెట్టిన ధర కంటే ఇతర లీగ్ లలో ఎక్కడ ఎక్కువ ధర రాదు అని అందరూ అభిప్రాయపడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం ఒక ఆటగాడు విషయంలో మాత్రం ఇది తారుమారు అయింది. ఐపీఎల్ లో అతనికి దక్కిన ధర కంటే ఏకంగా ఒక ప్రాంతీయ లీగ్ లో అతనికి ఎక్కువ ధర దక్కడం గమనార్హం. ఆ యువ ఆటగాడు ఎవరో కాదు ఐపీఎల్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్రౌండర్ సాయి సుదర్శన్. ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్ వేలం జరగగా జాక్పాట్ కొట్టాడు ఆల్ రౌండర్.


 మహాబలిపురంలో జరుగుతున్న  తొలి వేలంలో సాయి సుదర్శన్ ను లైకా కోవై కింగ్స్ ఏకంగా 21.6 లక్షల రికార్డు దరకు సొంతం చేసుకుంది. సాధారణంగా అయితే కోవై కింగ్స్ మొత్తం పర్స్ విలువ 70 లక్షలు మాత్రమే. అయితే ఒక్క సాయి సుదర్శన్ పైనే ఆ జట్టు మూడోవంతుని వెచ్చించడం కాస్త చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇలా తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో వేలంలో అతనికి లభించిన మొత్తం ఇక ఐపీఎల్లో అతనికి వచ్చిన మొత్తం కంటే ఎక్కువ కావడం గమనార్హం. 2022 ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ 20 లక్షల బేస్ ప్రైస్ కి అతన్ని సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: