గత కొంతకాలం నుంచి భారత యువ ఓపెనర్  శుభమన్ గిల్ తన ప్రతిభతో ఎంతలా ఆకట్టుకుంటున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అన్ని ఫార్మట్లలో కూడా మంచి ప్రదర్శన చేస్తూ సెంచరీల మోత మోగిస్తున్నాడు అని చెప్పాలి. 23 ఏళ్ల వయసులోనే ఎంతోమంది స్టార్ ప్లేయర్లకు సాధ్యం కాని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. డబుల్ సెంచరీలు చేస్తూ ఇక తన ఫామ్ కు తిరుగులేదు అనే నిరూపిస్తున్నాడు అని చెప్పాలి.. ఈ క్రమంలోనే మూడు ఫార్మాట్లలో కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఇక భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు శుభమన్ గిల్.



 అంతేకాదు ఇక టీమిండియా భవిష్యత్తు స్టార్ ఎవరో కాదు అది తానే అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరి రెండు టెస్ట్ మ్యాచ్ లలో కూడా అవకాశం దక్కించుకున్నాడు. అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక చివరి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయాడు అని చెప్పాలి. ఏకంగా 128 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతని అసాధారణమైన ప్రతిభ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇదే విషయంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ సైతం స్పందించాడు.


 యువ ఓపెనర్ శుభ మన్ గిల్ ప్రతిభ పై ప్రశంసలు వర్షం కురిపించాడు. టీమిండియాలో పర్మినెంట్ ఆటగాడిగా మారడానికి గిల్ ఎంతగానో కష్టపడ్డాడు అంటూ సౌరబ్ గంగూలీ ప్రశంసించాడు. అతడు దాదాపు గత 6 నుంచి 7 నెలలుగా బాగా రాణిస్తున్నాడు. ఇంకేం చేయాలి. గిల్ ఇప్పుడు టీమిండియాలో పర్మినెంట్ ప్లేయర్ అంటూ సౌరబ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ ద్వయం టీం ఇండియాకు బలం అంటూ సౌరబ్ గంగూలీ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: