గత కొంతకాలం నుంచి ఈ ఏడాది జరగబోయే వరల్డ్ కప్, ఆసియా కప్ విషయంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అటు పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ కోసం తాము పాకిస్తాన్ కు వెళ్ళబోము అంటూ స్పష్టం చేసింది బీసీసీఐ. తటస్థ వేదికపై టోర్నీ నిర్వహిస్తేనే తాము ఆసియా కప్ లో పాల్గొంటాము అంటూ స్పష్టం చేసింది. అయితే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము కూడా భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడబోము పాక్ బోర్డు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఐసిసి ఊహించని భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది అనేది తెలుస్తుంది.



 ఒకవేళ పాకిస్తాన్ భారత్ లో వన్డే వరల్డ్ కప్ ఆడకపోతే భారీ ఫైన్ కట్టాల్సి ఉంటుందని ఐసిసి పిసిబిని హెచ్చరించిందట. పది గ్లోబల్ టీమ్స్ తో వన్డే వరల్డ్ కప్ 2023 టోర్ని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే టోర్నీ కోసం ఐసీసీ తరఫున బీసీసీఐ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 963 కోట్ల టాక్స్ లు చెల్లిస్తుంది. దీంతో ఐసీసీకి వన్డే వరల్డ్ కప్ కారణంగా వేల కోట్ల ఆదాయం రానుంది. అయితే ఇప్పటికే వరల్డ్ కప్ ప్రోటోకాల్ ని కూడా తయారు చేసింది ఐసీసీ. ఒకవేళ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆడకపోతే మరో టీం ని నేరుగా సూపర్ లోకి తీసుకు రావాల్సి ఉంటుంది.



 ఇక వరల్డ్ కప్ షెడ్యూల్ లో కూడా చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక భారత్ ఆసియా కప్ ఆడనందుకు పాకిస్తాన్ కూడా భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ ఆడబోము అంటూ నిర్ణయం తీసుకుంటే మాత్రం.. 200 మిలియన్ డాలర్లు అంటే పాక్ కరెన్సీ లో 5900 కోట్ల రూపాయలకు పైగా ఫైన్ కట్టాల్సిందే అంటూ ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డును హెచ్చరించింది. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కు ఇంత భారీ ఫైన్ కట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. దీంతో ఆసియా కప్ విషయంలో బిసిసిఐ పంథం నెగ్గినట్లే అని తెలుస్తుంది. అయితే ఆసియా కప్ వేదికను ఎక్కడికి మారుస్తారు అనే విషయంపై  క్లారిటీ రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: