ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీమ్స్ లలో ఒకటిగా కొనసాగుతున్న టీమ్ ఇండియాకు.. గత కొన్నెళ్ల నుంచి వరల్డ్ ఛాంపియన్గా నిలవడం అనేది కేవలం అందని ద్రాక్ష లాగానే మారిపోయింది అని చెప్పాలి. అప్పుడెప్పుడో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియా..  ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా ముద్దాడ లేకపోయింది అని చెప్పాలి. అయితే అటు ధోని నుంచి కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ.. జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించినప్పటికీ అటు ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలిపించలేకపోయాడు.


 పలుమార్లు కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ఫైనల్ వరకు వెళ్లినప్పటికీ.. ఇక చివరి అడుగులో తడబడి కేవలం రన్నరప్ తో మాత్రమే సరిపెట్టుకుంది చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ట్రోఫీ గెలవకపోవడంతో కోహ్లీ పై విమర్శలు రాగా.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇక రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలు చేపట్టగా అతనికి కెప్టెన్సీలో తప్పక టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుంది అని అనుకున్నారు. కానీ గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రోహిత్ కు కెప్టెన్ గా మరోసారి టీమిండియాని  విశ్వ విజేతగా నిలిపేందుకు అవకాశం వచ్చింది.


 నేటి నుంచి డబ్ల్యుటిసి ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్లో గెలిస్తే సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకునే   టెస్ట్ ఫార్మాట్లో అటు విశ్వవిజేతగా నిలుస్తుంది టీమిండియా. ఇదే విషయంపై మాట్లాడాడు రోహిత్ శర్మ. కెప్టెన్ గా రిటైర్ అయ్యేలోపు ఒకటి రెండు ఛాంపియన్షిప్ గెలవాలని కోరుకుంటున్నాను. అందరికీ లాగానే ప్రతి ఛాంపియన్షిప్ విన్ కావాలని నాకు ఉంది. భారత క్రికెట్ను ముందుకు తీసుకెళ్లడం.. వీలైనంత ఎక్కువ టైటిల్స్  గెలిపించడమే నా లక్ష్యం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: