బజాజ్ ఆటో లిమిటెడ్ ఇండియాలో ఎన్నో బైక్స్ మార్కెట్ రంగంలోకి విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా బజాజ్ 125 సీసీ ఇంజన్ గల బైక్ నీ విడుదల చేసింది. బజాజ్ CT 125X బైక్ ఎక్స్ షోరూం ధర రూ.71,354 కలదు ప్రస్తుతం CT 110X కంటే 5056 కంటే ఎక్కువగా ఉంటుంది.. ఇక అంతే కాకుండా 125సీసీ హోండా షైన్ కంటే రూ. 6000 తక్కువగా కలదు. బజాజ్ సిటి 125x బైక్ 3 డ్యూయల్ టోన్ కలర్ స్కీములలో విడుదల చేసింది ఇందులో బ్లూ రెడ్ గ్రీన్ కలర్ లో మాత్రమే లభిస్తున్నాయి.


ఇక బజాజ్ CT 125X బైక్ 124.4CC సింగిల్ సిలిండర్ ఇంజన్ ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, బజాజ్ డిటిఎస్ i టెక్నాలజీ తో సెట్ అప్ చేయడం జరిగిందటఇంజన్ 8000 rpm వద్ద గరిష్టంగా 10.9 శక్తిని విడుదల చేస్తుంది. ఈ బైక్కు 5 స్పీడ్ గేర్ ట్రాన్స్మిషన్ కలవు. ఇక ఈ బండి హలోజన్ బలుపుతో గుండ్రటి హెడ్ లాంప్ తో కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడి డే టైమ్ రన్నింగ్ లాంప్ కూడా అమర్చడం జరిగింది. పెట్రోల్ ట్యాంకు పైన గ్రాఫిక్స్ ఇంకా పలు వాటిని చిత్రీకరించడం జరిగింది. వెనుక భాగంలో ఒక గ్రాబ్ రెల్ కలదు. ఇందులో లగేజ్ను సులుభంగా పెట్టుకోవచ్చు.


ఇక సింగిల్ సీటుతో పాటు.. వెనుక ప్రయాణికుడు చాలా కంఫర్టబుల్ గా సరిపోయేంత ప్లేస్ కలదు. ముఖ్యంగా బండి బాడీ వర్క్ ఎక్కువగా కనిపించదు ఇక నిత్యం ప్రయాణికులకు బైక్ చాలా ఉపయోగపడుతుంది. ఈ బైక్ ఎలాంటి కఠినమైన ప్లేస్ లోనైనా పెద్ద స్పీడ్ బ్రేకర్లు నడిపేటప్పుడైన ఇంజన్ రక్షించడానికి ఒక బెల్లీ పానును అందిస్తోంది. ఇక ఈ బైకు దాదాపుగా 80 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: