బాలీవుడ్ హీరోల సంపాద‌న గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. హీరోలు భారీగా రెమ్యున‌రేష‌న్ పుచ్చుకోవ‌డంతో  పాటు లాభాల్లో కూడా వాటాలు పుచ్చుకుంటారు. ఇక బాలీవుడ్ లో చాలా మంది హీరోలు బుల్లి తెర‌పై కూడా టీవీ షోలు చేస్తూ దండిగా సంపాదిస్తుంటారు. అలా ఎక్కువ రెమ్యున‌రేష‌న్ పుచ్చుకునేవారిలో కండల వీరుడు స‌ల్మాణ్ ఖాన్ ముందు వ‌రుస‌లో ఉంటారు. స‌ల్మాన్ ఖాన్ సినిమాల‌క‌యినా టీవీ షోల‌కు అయినా తీసుకునే రెమ్యున‌రేషన్ బాలీవుడ్ వ‌ర్గాల్లో ఎప్పుడూ హీట్ టాపిక్ గానే ఉంటుంది. కాగా తాజాగా కండ‌ల వీరుడి రెమ్యున‌రేష‌న్ మ‌రోసారి చ‌ర్చ‌గా మారింది. 

ఇండియాలోనే ఎంతో క్రేజ్ ఉన్న రియాలిటీ షో హిందీ బిగ్ బాస్ ఈ షోకు గ‌త కొన్ని సీజ‌న్ల నుండి స‌ల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే బిగ్ బాస్ ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించ‌డంలో స‌ల్లూ బాయ్ పాత్ర కూడా ఎంతో ఉంద‌ని అనుకుంటారు. స‌ల్మాన్ ఖాన్ ఎక్క‌డ బ‌య‌పెట్టాలో ఎక్క‌డ బుజ్జ‌గించాలో భాగా తెలుస‌న‌ని అందువ‌ల్లే అత‌డి హోస్టింగ్ ను బాలీవుడ్ జ‌నాలు తెగ ఎంజాయ్ చేస్తుంటార‌ని చెప్పుకుంటారు. అయితే హిందీ బిగ్ బాస్ విజ‌యంలో త‌న‌దైన ముద్ర వేసుకున్న స‌ల్లూ భాయ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ప‌ద్నాలుగు సీజ‌న్ లు పూర్తి చేసుకుని ప‌దిహేనో సీజ‌న్ లో అడుగుపెడుతున్న బిగ్ బాస్ సీజన్ 15 కోసం ఏకంగా 350 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నార‌ని బాలీవుడ్ మీడియాలో వార్తలు చెక్క‌ర్లు కొడుతున్నాయి. 

ఇక ఈ రేంజ్ లో  రెమ్యున‌రేష‌న్ తీసుకోవ‌డం బుల్లి తెర హిస్ట‌రీ లోనే మొద‌టి సారి కావ‌డం విశేషం. అంతే కాకుండా స‌ల్మాన్ ఖాన్ త‌న రెమ్యున‌రేష‌న్ తో బుల్లితెరపై స‌రికొత్త రికార్డును కూడా క్రియేట్ చేశార‌ని తెలుస్తోంది. ఇక స‌ల్లూ బాయ్ కార‌ణంగానే బిగ్ బాస్ కు అంత ఆధ‌ర‌ణ రావ‌డం బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కుషీగా ఉండ‌టంతోనే ఏకంగా 350 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు బిగ్ బాస్ కు స‌ల్మాన్ ఖాన్ క‌ష్టం కూడా త‌క్కువే ఉంటుంది. సినిమా అయితే ఫైట్ లు, డ్యాన్స్ లు చేయాలి కానీ బిగ్ బాస్ అయితే నిల‌బడి హౌస్ మేట్స్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే స‌రిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: