బుల్లితెర యాంకర్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ అనతి కాలంలోనే బుల్లితెరపై పాపులర్ యాంకర్ గా పేరు తెచ్చుకోవడం తోపాటు వెండితెరపై కూడా మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది.  ప్రస్తుతం సుకుమార్, క్రిష్ ఇలాంటి దిగ్గజా దర్శకులు కూడా అనసూయ కోసం తమ సినిమాలలో ప్రత్యేకమైన పాత్రను రూపొందిస్తున్నారు అంటే ఇక ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అటు బుల్లితెరపై ఇటు వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.ఇకపోతే తనను ఎవరైనా ఏదైనా అంటే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి కూడా అనసూయ ఏమాత్రం ఆలోచించదు.. అందుకే అనసూయ ఎప్పటికప్పుడు వార్తల్లో వైరల్ అవుతూ.. ట్రొల్ అవుతూనే ఉంటుంది. ఈజీలో ఉండదు ఈమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా తనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట మరింత హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకెళితే అనసూయ తాజాగా తెలిసిన వాళ్ళ ఫంక్షన్కు వెళ్లిందట. అక్కడ తిన్న భోజనం ప్రయాణంలో సరిగా డైజెస్ట్ అవ్వక వాంతులు అయినట్టు తెలుస్తోంది

దీంతో ఆమె నీరసించిపోయి తల పట్టుకున్నట్లు అందుకు సంబంధించిన ఒక ఫోటో ,వీడియో కూడా వైరల్ అవడంతో అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత ఆమె తనకు బాగానే ఉందని .. వాంతులు అవడం వల్లే నీరసించాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో అనసూయకు సంబంధించిన ఈ ఫోటో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్నా.. వెండి తెరపై పలు అవకాశాలు అందుకుంటూ మరింత దూసుకుపోతోంది.  ఈ క్రమంలోని కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో ఈమె నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: