వేసవి వచ్చింది అంటే అందరికి చెమటలు పట్టడం ఖాయం. ఉదయం తొమ్మిది అవ్వగానే బయటకు రావాలి అంటే జనాలు భయంతో వణికిపోతూన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు కాస్త ముందుగానే మండిపోతున్నాయి.. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత ఎవరూ బయటకు రావడం లేదు.. రోడ్లన్ని కూడా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. మధ్యాహ్నం ఏదైనా అత్యవసర పని వుంటే తప్ప మరెక్కడా జన సంచారం లేరు. ఉద్యోగాలు చేస్తున్న బయట తిరిగే వారు ఆటో రిక్షాలకు ప్రియారిటీ ఇవ్వడం లేదు. ఎక్కువ మంది ఏసీ క్యాబ్ లను బుక్ చేసుకొని వెళ్తున్నారు.


అయితే దీనిని అధిగమించేందుకు, కష్టమర్లను ఆహ్వానించేందుకు ఓ ఆటో రిక్షా వాలా విన్నూత్నంగా ఆలోచించాడు..రిక్షాలో ప్రయాణించే వారికి ఎలాగైనా చల్లదనం కల్పించాలనే ఆలోచన చేశాడు. అతడు చేసిన ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..దాంతో అందరు కామెంట్లు కూడా చెస్తున్నారు. ఇంతకీ ఆయన ఎం చేశాడు..అతడి ఆలోచన తో లాభాన్ని పొందగలడు.రిక్షా వాలా తన రిక్షాను ఓ మినీ గార్డెన్ గా మార్చేశాడు. తన రిక్షాలో ప్రయాణించే వారికి ఎండ నుంచి ఉపశమనం కల్గించేందుకు ఇలా ఆలొచించాడు..


రిక్షా పైన గార్డెన్ లో గడ్డి పెంచినట్లు పెంచారు.రిక్షాకు ఇరు పక్కల పూల కుండీలు పెట్టి, వాటి తీగలను పైకి ఎగబాకేలా చేశాడు. ఇలా మొత్తం రిక్షాను ఒక పార్క్ లాగా చేశారు..అందులో ప్రయాణించేవారికి ఒక పార్క్ లో కూర్చున్న ఫీలింగ్ ఉన్నట్లు భావిస్తున్నారని అంటున్నారు..అతని ఐడియా నిజంగానే వర్కౌట్ అయ్యింది. జనాలు కూడా అతడి రిక్షాను ఎక్కడానికి ఆసక్తి చూపిస్తున్నారు..ట్వీట్ కు 20,000 కంటే ఎక్కువ లైక్‌లు, 2000 కంటే ఎక్కువ రీట్వీట్‌లతో దూసుకుపోతోంది. రిక్షా డ్రైవర్ సృజనాత్మకతకు నెటిజన్లు ఫిధా అవుతున్నారు. ఆ రిక్షా ఫోటోను మీరు కూడా ఒకసారి చూడండి..



మరింత సమాచారం తెలుసుకోండి: