ఆడవాళ్లు ఇష్టపడే వాటిల్లో జుట్టు కూడా ఒకటి. జుట్టుకు ప్రధాన శత్రువు చుండ్రు. వాతావరణ కాలుష్యం, ఉష్ణోగ్రతలు, ఆహారపుటలవాట్లు తదితర కారణాల మూలంగా చుండ్రు వస్తుంది. ఎంత ఒత్తైన, బలమైన జుట్టు ఉన్నప్పటికీ తలలో చుండ్రు చేరితే తక్కువ సమయంలోనే జుట్టు బలహీనపడిపోతుంది. కొందరిలో చుండ్రుతో బాటు తీవ్రమైన దురద ఉంటుంది. అతిగా గోకటం మూలంగా మాడు మీదా చిన్న చిన్న గాయాలు కావటం కూడా చూస్తుంటాం.ఇన్ని సమస్యలకు కారణమయ్యే చుండ్రును చిన్న చిన్న చిట్కాలతో దూరం చేసుకోవచ్చు. 

 

 

 

10 వేప ఆకులు, అరకప్పు పెరుగు, చెంచా నానబెట్టిన మెంతులు, చెంచా నిమ్మరసం కలిపి రుబ్బి నూనెతో కలిపి మాడుకు రాసుకుని తలస్నానం చేస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.వారానికి కనీసం 2 రోజులైనా శీకాయ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. షాపులు వాడొద్దు.అరా చెంచా వంటసోడా, 2 చెంచాల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టిస్తే చుండ్రు నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.2 చెంచాల మెంతులు కప్పు పులిసిన పెరుగులో నానబెట్టి తలకు పట్టించి తలస్నానం చేస్తే చుండ్రు అదుపులోకి వస్తుంది.ఉసిరి, కుంకుడుకాయ, శీకాకాయ పొడులను సమపాళ్లలో కలిపి 1.5 లీటర్ల నీటిలో కలిపి వేడిచేసి చిక్కబడ్డాక దాన్ని తలకు పట్టించి స్నానం చేస్తే చుండ్రు బెడద ఉండదు.కొబ్బరినూనె, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు  వదిలిపోతుంది.

 

 

 

గసగసాలను ముద్దగా నూరి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే ఫలితం కనిపిస్తుంది.కప్పు వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తలకు పట్టించి.. కాసేపాగి తలస్నానం చేస్తే మంచి గుణం ఉంటుంది.కొబ్బరినూనెను వేడిచేసి అందులో పచ్చి మందారాకులను వేసి మరిగించి చల్లబరచి దాన్నిరోజూ తలకు పట్టిస్తే చుండ్రు సమస్యను అదుపుచేయవచ్చు.కొబ్బరి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం కలిపి తాగితే చుండ్రు సమస్య ఉపశమిస్తుంది. గుప్పెడు పుదీనా ఆకులను చెంచా నీళ్లు కలిపి మెత్తగా రుబ్బి.. మాడుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.అలాగే, గుడ్డు తెల్లసొనను జుట్టుకు పట్టించి.. గంట తర్వాత స్నానం చేసినా సమస్య దారికొస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: