మాసాయిపేట మండలం హకీంపేట లో ఈటెల రాజేందర్ కు సంబంధించిన జమునా హేచరీస్ భూముల సర్వే పురోగతిని పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్... రైతులకు పలు సూచనలు చేసారు. సర్వే పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని రైతులకు సూచించిన కలెక్టర్... సర్వే పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తాం అన్నారు. హద్దులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చెపట్టాం అని తెలిపారు ఆయన. ఈ విషయంలో జమున హేచరీస్ కోర్టును ఆశ్రయించారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రొసీజర్ ప్రకారం చేయాలనే కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభమైందని అన్నారు. సర్వే లో సీలింగ్ లాండ్, అసైన్మెంట్ లాండ్, పట్టా భూమి ఎంత అనేది ఖచ్చితంగా తేలుస్తామని స్పష్టం చేసారు. భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తాం అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts