సిద్ధిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామి రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక నేడు హై కోర్టు లో సిద్దిపేట మాజీ కలెక్టర్ రాజీనామా పై విచారణ జరుగుతుంది. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు అయిన్దితెలన్గాన హైకోర్ట్ లో. హైకోర్టులో పిల్ ను రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్ సింగ్, జె.శంకర్  పిల్ దాఖలు చేసారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు హైకోర్ట్ దృష్టికి తీసుకువెళ్ళారు.

ఐఏఎస్ లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటారని పిటిషనర్లు అంటున్నారు. వెంకట్రామిరెడ్డి నామినేషన్ ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పిటిషనర్లు చేర్చారు. నేడు దీనిపై తెలంగాణా హైకోర్ట్ లో విచారణ  జరగనున్న నేపధ్యంలో ఆసక్తి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts