ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం.. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుక‌లు నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని మార్చి 12న అంటే ఇవాళ  12వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ జెండాలు ఎగురేస్తారు. అలాగే దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను శుభ్రం చేస్తారు. రంగులు వేసి పూల మాలలతో అలంకరిస్తారు. పార్టీ పుట్టిన రోజు ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద‌ర్శి స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. సజ్జల పిలుపు మేరకు పార్టీ పండుగ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు అన్నీ రెడీ అవుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం ఆవిర్భవించిన వైఎస్సార్ కాంగెస్ పార్టీ 8 ఏళ్ల పాటు ఒంటిరిగానే పోరాడింది. మూడేళ్ల క్రితం ఏపీలో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: