వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలకు పదో తరగతిని విద్యార్హతగా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు విద్యావంతులు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఈ దిశగా పలు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని కనీసం ఇంటర్మీడియట్ చదివించాలన్న సీఎం.. ఈ దిశగా ముందుకు వెళ్లేందుకే ఈ కొత్త రూల్ పెట్టినట్టు తెలిపారు.


అక్టోబర్ 1 నుంచి  ఈ రెండు  పథకాలను అమల్లోకి తెస్తున్నట్లు తెలిపిన సీఎం... వివాహమైన 60 రోజుల్లోపు దరఖాస్తు చేసుకుంటే ప్రతి 3 నెలలకు ఓసారి లబ్దిదారులకు ఆర్ధిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పేద కుటుంబాల్లోని ఆడ పిల్లల వివాహానికి  ఆర్ధిక సాయం అందించేందుకు రెండు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పథకాలను ప్రారంభించారు. ఎస్సీ ,ఎస్టీ, బీసీ లకు వైఎస్ ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని, ముస్లిం మైనార్టీలకు వైఎస్ ఆర్ షాదీ తోఫా పథకాలను ప్రారంభించారు. వీటికి సంబంధించిన వెబ్ సైట్ ను సీఎం ఆవిష్కరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: