పోలీస్ ఉద్యోగాలలో వయోపరిమితిని పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి నేతలు సీఎంకు విజ్ఞప్తి చేస్తుున్నారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు  జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వినతి పత్రాలు అందజేస్తున్తనారు. ప్రభుత్వం చేసిన తప్పుకు సుమారు రెండు లక్షల పైచిలుకు పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు అర్హత కోల్పోయారని వారు అంటున్నారు.


ప్రభుత్వ సకాలంలో ఉద్యోగ ప్రకటన ఇచ్చి ఉంటే లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాలకు అర్హత సాధించేవారని వారు అంటున్నారు. 25 రోజులుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి వయోపరిమితిని పెంచాలని వినతి పత్రం ఇవ్వాలనుకున్నామని.. కానీ ఆయన అపాయింట్మెంట్ దొరకలేదని వారు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపామని వారు చెప్పారు. సీఎం పుట్టినరోజు కానుకగా నిరుద్యోగులకు 5 సంవత్సరాల వయోపరిమితిని పెంచాలని వారు కోరుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: