ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటే ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా నోటిఫికేషన్లు వస్తున్నాయని హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ అన్నారు. నియామకాల్లో ముందుకు వెళ్లకుండా అనేక అవరోధాలకు బీఆర్‌ఎస్‌ సర్కారు కారణం అవుతుందని ఈటెల రాజేందర్‌ మండిపడ్డారు. నోటిఫికేషన్లు రావాలి ప్రక్రియ సాగుతున్నట్లు కనబడాలి తప్పితే ఉద్యోగాల భర్తీ చేయకూడదనే చిల్లర ఆలోచన కనబడుతుందని ఈటెల రాజేందర్‌ అన్నారు. తమకు న్యాయం చేయాలని ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగారని ఈటెల రాజేందర్‌ అన్నారు.


నాలుగు మీటర్ల లాంగ్‌ జంప్‌ సాధ్యమయ్యే పనికాదని ఈటెల రాజేందర్‌ అన్నారు. ఇతర రాష్ర్టాల్లోనూ లేదు సరిచేయమని కోరితే పట్టించుకోవడంలేదని ఈటెల రాజేందర్‌ అన్నారు. కోర్టు తీర్పును అమలు చేయాలని కోరినప్పటికీ పట్టించుకోలేదని ఈటెల రాజేందర్‌ దుయ్యబట్టారు. ఇప్పటికైనా కోర్టు తీర్పును అమలు చేయాలని ఈటెల రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: