కేసీఆర్ భాజపా  ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి పిలవకుండా నియంతృత్వంగా వ్యవహారిస్తున్నారని బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్‌ పార్టీల మధ్య ఇనుపగొడలు కట్టారని...ఇతర పార్టీల నేతల మధ్య స్నేహ పూరిత వాతావరణం లేకుండా చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ దుయ్యబట్టారు.  ఎన్నికల ప్రక్రియను డబ్బుతో ముడిపెట్టి అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కును డబ్బుతో కొంటున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు.

కేసీఆర్ లక్షల కోట్లు అక్రమంగా సంపాదించారని ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ఉన్న భూములను అక్రమించుకుని అమ్ముకుని నార్త్‌, ఈస్ట్‌ రాష్ట్రాల్లో ఖర్చు పెడుతున్నారని ఈటల రాజేందర్ విమర్శించారు. చిల్లర రాజకీయాన్ని దేశానికి రుద్దడమే భారాస పార్టీగా ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎల్లమ్మబండతోపాటు హైదరాబాద్ నగరంలో గుంజుకున్న భూములపై కేసీఆర్‌కు దమ్ముంటే సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: