తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగుల ఫిట్ మెంట్ ఇతర అంశాలపై విద్యుత్ శాఖ యాజమాన్యానికి, కార్మిక సంఘాల నేతలకు మధ్య ఒప్పందం కుదిరింది.  కార్మిక సంఘాల డిమాండ్స్ కూడా పరిశీలించామని సంయుక్త కార్మిక శాఖ కమీషనర్ శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని కార్మిక శాఖ కార్యాలయంలో సంయుక్త కార్మిక శాఖ కమిషనర్ తో విద్యుత్ సంఘ నేతల సమావేశం అయ్యారు. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మికశాఖ కార్యాలయంలో కార్మికులు సమ్మె నోటీసును అందజేశారు. చర్చల తర్వాత ఆ సమ్మె నోటీసును సైతం కార్మిక సంఘాల నేతలు ఉపసంహరించుకున్నారని కార్మిక శాఖ కమీషనర్ వెల్లడించారు.  


ఆర్టిజన్స్ అంశాలపై కూడా కార్మిక సంఘాల నేతలు తమ దృష్టికి తీసుకువచ్చారని..  ఎక్కువ శాతం ఆర్టిజన్స్ ప్రస్తుతం సమావేశం అయిన సంఘాల్లోనే ఉన్నాయని..  ఈ ఒప్పందం తర్వాత ఏ యూనియన్, కార్మిక సంఘాలు కూడా సమ్మెకు పోరాదని సంయుక్త కార్మిక శాఖ కమీషనర్ శ్యాంసుందర్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: