దేశంలో విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయి. భారత్‌లో గత ఆర్థిక ఏడాది 32.73 కోట్లు మందికిపైగా విమానాలల్లో ప్రయాణించారట. ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 73.3శాతం అధికంగా ఉందట. ఈ ఏడాది మార్చిలో 3.10 కోట్లు మంది ప్రయాణించగా ఇది అంతకు ముందు ఏడాది మార్చితో పోలిస్తే 27శాతం ఎక్కువని ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయట.


ఈ ఏడాది మార్చిలో 53.29లక్షల మంది విదేశాలకు ప్రయాణాలు చేయగా, ఏప్రిల్‌ నుంచి మార్చి వరకు గత ఆర్థిక ఏడాదిలో 5.69 కోట్ల మంది విదేశాలకు రాకపోకలు సాగించారని లెక్కలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆరు విమానాశ్రయాల నుంచి గత ఆర్థిక సంవత్సరం 2.54 కోట్లు మంది ప్రయాణించారట. ఒక్క శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు నుంచి 2.09 కోట్లు మంది ప్రయాణించినట్లు ఎయిర్‌ పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లెక్కలు చెబుతున్నాయి. సూపర్ కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: