అమూల్‌ పాల విషయంలో కేసీఆర్‌, మోదీ కుమ్మక్కయారని బీఎస్పీ ఆరోపిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ - అమిత్‌షా ద్వయం నినాదం... వన్ మిల్క్ - వన్‌ నేషన్‌లో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా భాగమయ్యారని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పాడి రంగాన్ని బలోపేతం చేసి రైతులను ఆదుకోవాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ డిమాండ్ చేశారు.


 తెలంగాణ విజయ డెయిరీని అమూల్‌ డెయిరీలో కలిపేందుకు కుట్ర జరుగుతున్న దృష్ట్యా... అలాంటి సంస్థలను రాష్ట్రంలో అడుగుపెట్టనీయవద్దని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణలో విజయ, ముల్కనూరు, కరీంనగర్, మదర్ డెయిరీలు అద్భుతంగా నడుస్తున్నాయన్నారు. గుజరాత్‌కు చెందిన అమూల్‌కు ఆ సంస్థలు, పాడి రైతులను కేసీఆర్‌ సర్కారు తాకట్టుపెట్టబోతోందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోకపోతే పాడి రైతుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుందని ఆర్‌ఎస్‌పీ ఆందోళన వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: