ఎంత సంపాదిస్తే ఎం లాభం కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రలేకుంటే.. ప్రయోజనమేమి ఉండదు.. అలా చాలా మంది చేస్తుంటారు. సంపాదన మీద మోజుతో చాలా మంది ఆరోగ్యాన్నే పట్టించుకోవడం మర్చిపోతుంటారు. అలాంటి వారి కనీసం ఇంట్లో దొరికే వాటితో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్ఛునో ఇప్పుడు చూద్దాం. సులువుగా దొరికే కొన్ని పదార్ధాల తీసుకోవడం ద్వారా మనకు సాధారణంగా వచ్చే కొన్ని జబ్బులను రాకుండా చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సీజన్ తో పనిలేకుండా ప్రతి సీజన్లో దొరికే నిమ్మకాయలతో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచునో చూద్దాం. నిమ్మలోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, సి విటమిన్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయట. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ వంటి వాటి నుండి విముక్తి పొందాలంటే రోజు నిమ్మ రసం తీసుకుంటే మేలంటారు డాక్టర్లు. అంతేకాదండోయి.. భోజన ప్రియులు తినే ఆహరం అరగక పోవడం వంటివి జరుగుతుంటాయి. ఆ సమస్య నుండి విముక్తి పొందాలంటే ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకుంటే ఉదర సమస్యల నుండి విముక్తి పొందవచ్చునట. 


కేవలం ఈ నిమ్మ రసాన్ని అలాగే తీసుకోకుండా ఈ నిమ్మ రసంలో కొద్దిగా తేనే కలుపుకొని తాగడం వల్ల శరీరానికి మంచి ఫలితం ఉంటుందంటున్నారు. గోరువెచ్చని నీటిలో కొంచం తేనె, నిమ్మరసం వేసుకుని తాగితే మీకు ఆయాసం తగ్గడమే కాకుండా అధిక బరువు నుండి ఉపశమనం కలుగుతుంది . వేడి నీటిలో తేనె, తులసి ఆకురసం కలుపుకొని తీసుకుంటే.. దగ్గు, జలుబు తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనే వేసుకొని పుక్కలిస్తే చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన లాంటివి తగ్గిపోతాయి.


మీ ముఖం కాంతివంతంగా కనిపించాలంటే కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచం తేన, కొద్దిగా శెనగపిండి కలుపుకుని మీ ముఖానికి మర్దన చేసుకోండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది. గ్లాస్ పాలలో స్పూన్ మిరియాల పొడి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే.. తలనొప్పి, గొంతునొప్పి సమస్యలు తొలగిపోతాయి. వారంలో ఒకసారైనా పాలకూరను తీసుకోవడం ద్వారా మీరు యవ్వనంగా కనిపిస్తారు. రోజు మొత్తంలో ఒకసారి చిన్న గ్లాస్ అల్లం టీ తాగడం ద్వారా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపించే నెలసరి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లలో ఎముకలు పటిష్టం కొరకు తరచు తెల్లనువ్వులు, బెల్లం తింటుండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: