ఈ రోజుల్లో జుట్టు సమస్యలు చాలా ఎక్కువవుతున్నాయి.అందులో  చుండ్రు సమస్యలతో చాలా మంది చాలా విధాలుగా బాధ పడుతున్నారు.ఒక్కసారి చుండ్రు వచ్చిందంటే అంత ఈజీగా ఆ సమస్య పోదు. అయితే ఇప్పుడు చెప్పే సూపర్ టిప్స్ ని పాటించడం వల్ల శాశ్వతంగా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందోచ్చు.తలకు శాశ్వతంగా చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే  సోయా బీన్ ఆయిల్‌  అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే సోయా బీన్ ఆయిల్ రాయడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా తయారవుతుంది. ఈ ఆయిల్‌లో ఐరన్, ప్రోటీన్, క్యాల్షియం, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి.. జుట్టు అందంగా ఉండేలా చేస్తుంది. అయితే సోయా బీన్ ఆయిల్ నేరుగా రాస్తే.. చుండ్ర నుంచి పెద్దగా ఉపశమనం ఉండదు.చుండ్రు సమస్య నుంచి శాశ్వతంగా ఉపశమనం పొందడానికి.. సోయాబీన్ ఆయిల్, పెరుగు కాంబినేషన్‌ కూడా చక్కగా పని చేస్తుంది. పెరుగులో.. కొద్దిగా సోయాబీన్ ఆయిల్ బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మ రసం కూడా కలిపి.. తలకు పట్టించాలి. ఇది ఓ 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.


ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.చుండ్రు సమస్యను తగ్గించడానికి సోయాబీన్ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. ఇందులో కర్పూరాన్ని కూడా వినియోగించవచ్చు. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి.. జుట్టుకి అంతా పట్టేలా అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు పోవడమే కాకుండా.. రక్త ప్రసరణ జరిగి జుట్టు బలంగా తయారవుతుంది.చుండ్రు ఎక్కువగా భుజాలపై, ముఖంపై పడి ఇబ్బంది పడుతుంది. అలాగే చుండ్రుతో పింపుల్స్ సమస్య కూడా అధికమవుతుంది. దీంతో నలుగురిలో తిరగాలన్నా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయట పడటానికి రకరకాల షాంపూలు, నూనెలు ఉపయోగించే ఉంటారు. అయితే ఇంట్లోనే పైన తెలిపిన టిప్స్ పాటించడం వల్ల సింపుల్‌గా ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన టిప్స్ పాటించండి. చుండ్రు సమస్య నుంచి చాలా ఈజీగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి: