అవినీతి కేసుల విషయంలో సుప్రీం కోర్ట్ ఆదేశాల తర్వాత ఇప్పుడు కోర్ట్ లు, విచారణ సంస్థలు కాస్త  దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా విచారణ సంస్థలు అన్నీ కూడా పెండింగ్ కేసులను విచారిస్తూ నివేదికలు సిద్దం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఒక కీల పరిణామం చోటు చేసుకుంది. మాజీ  కేంద్ర మంత్రికి 3 ఏళ్ళ జైలు శిక్ష విధించారు.

1999 లో జార్ఖండ్ బొగ్గు బ్లాక్ కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు కుంభకోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి దిలీప్ రేకు ప్రత్యేక సిబిఐ కోర్టు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఇటీవల దోషులుగా తేలిన మరో ఇద్దరికీ కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బొగ్గు కుంభకోణం విషయంలో ఎప్పటి నుంచో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: