ముఖ్యంగా రేపు ఢిల్లీకి తెలంగాణ మంత్రుల బృందం వెళ్లాలని కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఇవాళ భేటీలో నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రులను కలవాలని సూచించారు ముఖ్యమంత్రి. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు డిసెంబర్ 20న అన్నీ నియోజకవర్గాలలో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నియోజకవర్గాల్లో కేంద్రం వైఖరికి నిరసనగా ఆందోళనలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ముఖ్యంగా వరికి ప్రత్యామ్నయ పంటలు వేయించాలని.. అదేవిధంగా బీజేపీ, కేంద్రం దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని.. బీజేపీతో చావో రేవో తేల్చుకుందాం అని సీఎం దిశానిర్దేశం చేసారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి