కోవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరికీ ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి.. ఈ మేరకు బిజినెస్ లు చక్క దిద్దుకొనే పనిలో పడ్డారు.. ఇక వాణిజ్య బ్యాంక్ లు కూడా అదే పనిలో ఉన్నారు. వినియోగ దారులకు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త వాటిని ఇవ్వడం లేదా ఉన్న వాటికి అదిరిపోయే ఆఫర్లను ప్రకటించే ఏకైక బ్యాంక్ ఎస్బిఐ ఇప్పుడు జనాలను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ మేరకు సరికొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..


ఎస్‌బీఐ అందిస్తున్న ఈ పాలసీ తీసుకుంటే కరోనా వచ్చినప్పుడు అయ్యే ఖర్చుల నుంచి ఉపశమనం పొందొచ్చు. ఎస్‌బీఐ లైఫ్ అందిస్తున్న ఈ పాలసీ పేరు కరోనా గార్డ్ పాలసీ లేదంటే ఎస్‌బీఐ కరోనా రక్షక్ పాలసీ. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ పాలసీని తీసుకోవడం కోసం ఎటువంటి మెడికల్ టెస్ట్ లు లేకుండానే తీసుకొనే వెసులుబాటు ఉంది. 100 శాతం బీమా లభిస్తుంది. ఈ పాలసీ తీసుకోవడానికి కనీస వయసు 18 ఏళ్లు. ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియం రూ.156 నుంచి ప్రారంభమౌతోంది. గరిష్ట ప్రీమియం రూ.2230 వరకు ఉంటుంది..


105 రోజులు, 195 రోజులు, 285 రోజుల కాల పరిమితితో ఈ పాలసీలు తీసుకోవచ్చు. మీకు నచ్చిన టర్మ్ ఎంచుకొని కరోనా పాలసీ పొందొచ్చు. కనీసం రూ.50 వేల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా రూ.2.5 లక్షల మొత్తానికి బీమా పొందొచ్చు. తక్కువలో భీమాను పొందాలని అనుకునేవాళ్లు మాత్రం 50 వేల పాలసీని తీసుకోవచ్చు.రూ.157 చెల్లిస్తే సరిపోతుంది. 022-27599908 నెంబర్‌కు కాల్ చేసి పాలసీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఒక్కసారి ప్రీమియం కడితే చాలు. కరోనా వస్తే పూర్తి డబ్బులు పొందొచ్చు. లేదంటే ఎస్‌బీఐ లైఫ్ వెబ్‌సైట్‌కు వెళ్లి పాలసీ పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.. ఈ పాలసీ నిజంగానే అందరికీ ఉపయోగ పడుతుంది. మీరు కూడా ముందు జాగ్రత్త కోసం ఈ పాలసీని తీసుకోవడం మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి: