కేంద్రం రైతులకు ఎన్నో చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ కేంద్రం చేయాలనుకుంటున్న ఏ పనిని, ఏ అభివృద్ధికరమైన మార్పుని హైలెట్ చేయడానికి ఇక్కడ కొన్ని పత్రికలకు మనసు రావడంలేదని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్లు ప్రత్యేకించి మోడీపై ఉన్న కోపంతోనే, అసలు మోడీని దింపేయాలి అనే  ఆలోచనలో ఉన్నవాళ్లు ఎందుకు హైలెట్ చేస్తారని అంటున్నారు కొంతమంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో అందించే ఎరువులు మీద ఒక లక్ష ఎనిమిది వేల సబ్సిడీ అందించాలని కేంద్రం నిర్ణయించుకుంది.


ఫాస్పరస్, పొటాషియం ఎరువులకు 38 వేల కోట్లు, యూరియాకి 70 వేల కోట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ధరలను పెంచకూడదని నిర్ణయించుకుంది. మొన్న ఢిల్లీలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుక్ మాండవియా తెలిపారు. ప్రస్తుతం యూరియా బస్తా ధర 276 రూపాయలు, డిఏపీ బస్తా ధర 1350 రూపాయలు ఉన్నట్టుగా ఆయన చెప్పారు.


సబ్సిడీ వల్ల 12 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారని ఆయన తెలిపారు. 2023-24 లో మొత్తం ఎరువుల సబ్సిడీ బిల్లు రెండు లక్షల 25 వేల కోట్ల రూపాయలని ఆయన తెలిపారు. నైట్రోజన్ పై 76రూపాయలు, ఫాస్పరస్ పై 41రూపాయలు, పొటాషియంపై 15రూపాయలు, సల్ఫర్ పై 2.8 రూపాయల సబ్సిడీకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని ఆయన తెలిపారు. ధరలు పెరగకుండా రైతులకు ఇబ్బంది లేకుండా కేంద్రం చూసుకుంటుంది.‌


అంటే ఒక బస్తాకు రైతుకు రెండున్నర వేల నుండి 3000 రూపాయల వరకు కేంద్రం భరిస్తుంది. ఒక సీజన్ కి లక్ష పదివేలు కోట్లు, అదే రెండు సీజన్లకి రెండు లక్షల 20 వేల కోట్ల వరకు సబ్సిడీని కేంద్రం భరిస్తూ ఉంటే ఆ వార్తని హైలెట్ చేయడానికి కూడా ఇక్కడ కొన్ని పత్రికలకు మనసొప్పడం లేదని తెలుస్తుంది. పైగా ముఖ్యమైన ఈ వార్తలు కూడా సైడ్ అయిపోతున్నట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: