ఒక్కసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి, టీడీపీ అభ్యర్ధుల విజయంతో రాష్ట్రంలో ఎల్లో మీడియా రెచ్చిపోయి వార్తలు పుంకానుపుంకాలుగా కథనాలు రాసేస్తున్నాయి. అయితే బాబు తెలివి ముందు జగన్ పని ఇక అయిపోయినట్టే అని ఊకదంపుడు వార్తలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బాబు రాజకీయాల్లో వ్యూహ రచనలు చేయడంలో దిట్ట అని జగన్ కు ఇక వణుకు పుట్టిస్తాడని ఓ పత్రికలో ఎడిటోరియల్ కథనం రాసుకొచ్చారు.


శాసన సభలో తన భార్యను అవమానించిన కూడా చంద్రబాబు ఏమి అనకుండా అదను కోసం చూసి వైసీపీని చావు దెబ్బ కొట్టారని అన్నారు. టీడీపీకి 19 సభ్యుల బలమే ఉండగా 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలని వైసీపీ నేత సజ్జల అన్నారు. కానీ నలుగురు ఎమ్మెల్యేలు ఎలా పక్కకు వెళ్లిపోయారో సజ్జల చెప్పాలని అన్నారు.


టీడీపీలో విచ్చలవిడి స్వేచ్ఛ ఇచ్చింది చంద్రబాబే అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీడీపీలో ఉన్నంత స్వేచ్ఛ వైసీపీలో లేదనే కార్యకర్తలు బాధపడుతున్నారు. జగన్ ని తక్కువ అంచనా వేసి చంద్రబాబు గతంలో అధికారం పోగొట్టుకుని బాధపడుతుంటే, జగన్ కూడా చంద్రబాబుని తక్కువ అంచనా వేసి ఇపుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా చంద్రబాబుకి మంచి పేరుందని ప్రచారం చేస్తున్నారు.


1983, 85, 94 సంవత్సరాల్లో టీడీపీ ని అధికారంలోకి తెచ్చింది ఎన్టీఆర్ అని  అందరికీ తెలిసిన విషయమే. కేవలం 1999లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పార్టీ విజయం సాధించింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారి మాత్రమే చంద్రబాబు పార్టీ ని గెలిపించారు. మిగతా ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ గెలిచింది. మూడు సార్లు ఓడినా చంద్రబాబు గురించి పులి నిద్రలేచింది. ప్రజలందరూ ఆయన అధికారాన్ని కావాలని కోరుకుంటున్నారని ఇష్టమొచ్చినట్లు కథనాలు రాస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: