జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నామన్న బీఆర్ఎస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో పోటీలో దిగలేదు. నామినేషన్లు పూర్తయ్యాయి. కానీ బీఆర్ఎస్ మాత్రం పోటీలో లేదు. ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటకలో పోటీ చేసి జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుని తీరుతాం అని ప్రగల్బాలు పలికారు. కానీ కర్ణాటకలో నామినేషన్ ముగిసిపోయింది. బీఆర్ ఎస్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.


కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు 3162 మంది అభ్యర్థులు, 5102 నామినేషన్లు వచ్చాయి. గడిచిన ఎన్నికలతో పోల్చితే రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలాయ్యాయి. గురువారంతో నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు 1619 మంది నామినేషన్లు వేశారు.


అత్యధికంగా బీజేపీ తరఫున 707 నామినేషన్లు, కాంగ్రెస్ తరఫున 651, జేడీఎస్ తరఫున 455, ఆప్ 373, బీఎస్పీ 179, ఎన్సీపీ నుంచి అయిదుగురు, సీపీఎం నుంచి అయిదు నామినేషన్లు దాఖలయ్యాయి. రిజిస్ట్రర్ అయినా పార్టీల నుంచి దాదాపు 1000 మందికి పైగా నామినేషన్లు దాఖలు చేయగా, స్వతంత్రంగా 1720 మంది వేశారు. అయితే జాతీయ పార్టీగా ఉద్భవించాం.


కేంద్రంలో అధికారంలోకి వస్తాం. కేసీఆర్ ప్రధానమంత్రి కావడం పక్కా అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నుంచి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క నామినేషన్ వేయకపోవడం దారుణం. అంటే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారా? లేక పోటీలో నిలబెట్టడానికి అభ్యర్థులు దొరకలేదా. మరి జాతీయ పార్టీగా మారిన తర్వాత జరగుతున్న మొదటి ఎన్నికల్లో నిలబడకపోతే ఆయా రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం ఎలా పెరుగుతుంది.

సాధారణ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకుంటోంది. పోటీ చేసే ఎక్కడ విజయం సాధించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ కనీసం ఓట్లు సాధించాలంటే దేశంలో ఎన్నికలు జరిగినా అక్కడ పోటీ చేయాలి. మరి కర్ణాటకలో పోటీ చేయకపోవడానికి గల కారణాలు ఏమిటి అనేది సీఎం కేసీఆర్ చెబితేనే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: