దళితులకు కేటాయించిన భూమిని వేరే వాళ్ళు కొనడమే తప్పు ఆ కొన్న వాళ్ళ దగ్గర ప్రభుత్వం తీసుకుని వాళ్లకు వేరే భూమిని ఎలాట్ చేయడం మరో తప్పు. అమరావతి విషయంలో జరుగుతున్న అంశం అదే అని తెలుస్తుంది. తెలంగాణ హైకోర్టు ఇటువంటి అంశం మీద ఒక తీర్పు ఇచ్చింది. ఈనం, ఎస్సీ భూములను కొన్నవారికి హక్కులు ఉండవని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.


అంటే ఈనం, ఎస్సీ భూములను 1954 కన్నా ముందు కొని ఉంటే ఆ భూమికి సంబంధించిన ఆధీన ధ్రువీకరణ పత్రం ఓఆర్సీ పొందే హక్కు గానీ, ఆ పత్రం కోసం దరఖాస్తు చేసుకునే హక్కుగానీ ఉండవని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తాజాగా స్పష్టం చేసింది. త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెల్లడించింది. గతంలో బీ.ఎన్.రామచంద్రారెడ్డి, ఎస్. వీరారెడ్డి కేసుల్లో ధర్మాసనం వేరువేరుగా తీర్పులను చెప్పింది.


దీంతో ఈ అంశం మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయన్, జస్టిస్ బి నవీన్ రావ్. జస్టిస్ పి సుడాల్ లతో కూడినటువంటి హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత ఇచ్చింది. 1955 తర్వాత కొన్న, ఇనాం ఎస్సీ భూములను కొన్న వాళ్ళకి చెల్లదని రద్దు చేసింది. 1955 తర్వాత ఇనాం, ఎస్సీ భూములను కొనుగోలు చేసిన వాళ్లకి ఓఆర్సి హక్కు చట్టంలో ఉండబోదని కోర్టు తెలిపింది.


రద్దు తర్వాత భూములన్నీ ప్రభుత్వం పరమవుతాయని కోర్టు స్పష్టత ఇచ్చింది. రద్దు తర్వాత జరిపే కొనుగోలు భూములు చెల్లవు. ఓఆర్సి పొందక ముందు ఇనాం, ఎస్సీ భూముల క్రయ విక్రయాలు చెల్లుబాటు కావు. ఓఆర్సి ఇనాం భూముల వాళ్లు వారసుల మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వాటికి గుర్తింపు లేదని హైకోర్టు ధర్మాసనం గత తీర్పులో వెల్లడించింది. ఇక్కడ కూడా కొన్ని భూములు 1955 చట్టానికి ముందున్న  భూములను చెప్పారు కానీ  అప్పట్లో కొనేసుకుంటే సమస్య లేదు కానీ ఇప్పుడు కొనుక్కొని అప్పటి డేట్ వేసుకుంటేనే అసలు సమస్య.

మరింత సమాచారం తెలుసుకోండి: