హైదరాబాదులో డాక్టర్ వృత్తి చేసుకునే శ్రీదేవికి ఎమ్మెల్యే టికెట్ రావడం, ఆ తర్వాత అందులో గెలవడం ఇవన్నీ జరిగినా  అమరావతి ఇంపాక్ట్‌తో నియోజకవర్గంలో మాత్రం తిరగలేకపోయింది. ఆ తర్వాత, ఆవిడ క్లాసు, కార్యకర్తలు మాస్ అవ్వడంతో కార్యకర్తలకు దూరం అయింది. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో ఆ దూరం అనేది పెరిగింది. మరొక విషయం ఏమిటంటే పబ్లిక్ లోకి కూడా వెళ్లలేకపోవడం, తన పార్టీకి వ్యతిరేకంగా ఇష్యూలు జరుగుతున్నప్పుడు దానిని టాకిల్ చేయలేకపోవడంతో నందిగామ సురేష్ దానిని క్యాష్ చేసుకోవడంతో ఆవిడ అలా పక్కకు ఉండిపోయింది.


ఆ దశలో జరిగిన పరిణామాల తర్వాత నీకు పబ్లిక్ లో ఆదరణ లేదు టిక్కెట్ ఇవ్వనన్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి బదులుగా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన పని తాను చేసింది. ఇప్పుడు ఆమె మీద తీవ్రాతి తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం. మొన్న ఒక ఔట్‌సోర్సింగ్ కార్యాలయంలో ఉన్న వస్తువుల్ని తలకొకటీ పట్టుకొని వెళ్లిపోయారు. ఎందుకంటే వాళ్ళే తీసుకొచ్చామని చెప్తున్నారట, సందీప్, సురేష్ ఇలా కొంతమంది వ్యక్తులు. చివరికి ఆవిడ తిరిగే జీపు కూడా వీళ్లే తీసుకొచ్చి పెట్టారట.


వాస్తవంగా ఒక ఎమ్మెల్యేకి ఇలాంటి సిట్యుయేషన్ ఎక్కడా ఉండదు. సాధారణంగా ఇలా కోటంరెడ్డికీ జరగలేదు, ఆనంకీ జరగలేదు, మేకపాటికీ జరగలేదు. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. వాళ్ల బృందం సెపరేట్‌గా ఉంటుంది. వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్లినా వాళ్ల బృందం అయితే ప్రత్యేకంగా ఉంటుంది. వీళ్ళకిలాగా ఆమెకి ఒక బృందం లేకపోవడం వల్ల వచ్చిన సమస్య ఇదని తెలుస్తుంది.


ఇక్కడ ఒక అవుట్ సోర్సింగ్ లాగా అందరూ తీసుకువచ్చిన వస్తువులతో అప్పటివరకు వాళ్ల కార్యాలయాన్ని నడపడం అయితే జరిగినట్లు తెలుస్తుంది. ఆవిడ ఎప్పుడైతే బయటికి వెళ్లిపోయిందో అప్పుడు ఆ  కార్యాలయం అవుట్ సోర్సింగ్ కార్యాలయం కావడంతో  ముందు ఎవరు తెచ్చిన వస్తువుల్ని వాళ్లు ఆ తర్వాత తీసుకెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: