తెలుగు ఇండస్ట్రీలో స్టైల్ కా బాప్ ఎవరంటే.. తడుముకోకుండా మనకు వెంటనే అల్లు అర్జున్ ఇమేజ్ మన మెదడులో మెదులుతుంది. అతని ఇమేజ్ ఒక్క మన తెలుగుకే పరిమితం కాలేదు.. కేరళలో మల్లు అర్జున్ గా కీర్తి గడించిన ఘనత ఒక్క మన అల్లు అర్జున్ దే. ఇక అల వైకుంఠపురములో సినిమాతో ఇంతవరకు వున్న రికార్డులను తిరగ రాసేసాడు బన్నీ. ఈయన ప్రస్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇది ఈయనకు 20వ సినిమా కావడం విశేషం. 

 

IHG

 

ఇండస్ట్రీ హిట్ అందుకున్న తర్వాత వస్తున్న సినిమా కావడం వల్లను, ఇంకా సుకుమార్ కాంబినేషన్ అవడం చేతనూ.. ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో నటించబోతున్నాడని అందరికి విదితమే. ఇక అసలు విషయం ఏమంటే, బన్నీ తన పర్సనల్ స్టాఫ్‌ను ట్రీట్ చేసే విధానం అందరికి నచ్చుతుంది. అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా అతను డౌన్ తో ఎర్త్ ఉంటారనేది అతని పర్సనల్ స్టాఫ్ అభిప్రాయ పడుతూ వుంటారు.

 

ఇప్పుడు అదే విషయం మనవాడు నిరూపించాడు. తన దగ్గర పని చేసే పర్సనల్ బాడీగార్డ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక దాంతో సుకుమార్ సినిమాలో నటించే లుక్ వచ్చేసింది అంటూ సోషల్ మీడియాలు తెగ ఊదర గొడుతున్నాయి. ఈ సినిమా కోసం చాలా చేంజ్ అయ్యాడు బన్నీ. ముఖ్యంగా గడ్డం పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయన లుక్ బయటికి రావడంతో సుక్కు ఒకింత నొచ్చుకున్నాడట. 

 

IHGఇక్కడ లీకైన ఫొటోలో అతను పెరిగిన జుట్టు, నెరిసిన గుబురు గెడ్డంతో కొంచెం మధ్య వయస్కుడిలా  కనిపిస్తున్నాడు బన్నీ. ఇక సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ లెక్క అల్లు అర్జున్ ఉన్నాడంటూ సదరు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ అని తెలిసినదే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షాకింగ్ ఏమంటే, కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజులు నిలిపి వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: