మలయాళ స్టార్ మోహన్ లాల్ హీరోగా మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన మలయాళ చిత్రం లూసిఫర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై 100కోట్ల వసూళ్లను రాబట్టి  బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈసినిమా మళయాలం తోపాటు తెలుగులో కూడా విడుదలైయింది కానీ తెలుగు ప్రేక్షకులు లూసిఫర్ ను పట్టించుకోలేదు. ఇక ఇటీవల ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయ్యాడు మెగా  పవర్ స్టార్  రామ్ చరణ్  దాంతో ఈ సినిమా ను తెలుగులో రీమేక్  చేయాలని ఫిక్స్ అయ్యాడు.
 
తన తండ్రి మెగా స్టార్ చిరంజీవిరీమేక్ లో హీరోగా నటించనున్నాడు. సాహో ఫేమ్ సుజీత్  ఈసినిమా ను డైరెక్టర్ చేయనున్నాడు. దసరాకు ఈసినిమా లాంచ్ కానుందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో కుష్భు ,చిరు  చెల్లలి పాత్రలో నటించనుండగా  ప్రముఖ నటుడు  జగపతి బాబు  విలన్ రోల్ లో కనిపించనున్నాడని టాక్ అయితే అధికారికంగా మాత్రంఎలాంటి సమాచారం వెలుబడలేదు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది. 
 
ఇక చిరంజీవి ప్రస్తుతం టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య లో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తి చేశాక  లూసిఫర్ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆచార్య  విషయానికి వస్తే ఇప్పటివరకు  40శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లో తిరిగి షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటించనుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ల పై  నిరంజన్ రెడ్డి , రామ్ చరణ్ సంయుక్తంగా  నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈసినిమా థియేటర్లలోకి రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: