ఈ సంవత్సరం కరోనా సెకండ్ వేవ్ తో సమ్మర్ రేస్ వృథా అవ్వడంతో ఇక టాలీవుడ్ ఆశలు అన్నీ దసరా పైనే ఉన్నాయి. దీనితో టాప్ హీరోల భారీ సినిమాలు అన్నీ దసరా పై కన్నేసి చాల వేగంగా తమ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు ఇండస్ట్రీలో తలలుపండిన వారిని కూడ కన్ఫ్యూజ్ చేస్తున్నట్లు టాక్. ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న విధంగా అక్టోబర్ 13న విడుదల అవుతున్నట్లు జక్కన్న ఈమూవీ నిర్మాతల చేత క్లారిటీ ఇప్పిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి రెండు పాటల షూటింగ్ మినహా అంతా పూర్తి అయిపోయిందని చెపుతున్నాడు.


అయితే లేటెస్ట్ గా రాజమౌళి తన ఆర్ట్ డైరెక్టర్ తన సినిమాటోగ్రఫర్లతో కలిసి జార్జియా వెళ్ళి వచ్చాడు. అక్కడ ఒక దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సంబంధించిన కీలక షెడ్యూల్ ను తీస్తారని తెలుస్తోంది. ఆగష్టు నెలలో ఈ షెడ్యూల్ ఉంటుందని ఈషెడ్యూల్ తరువాత మాత్రమే ఈమూవీ షూటింగ్ పూర్తి అవుతుందని అంటున్నారు.


జార్జియా ప్రాంతంలో ఆగష్టు నెల వచ్చేసరికి తరుచు వానలు వచ్చే ఆస్కారం ఉంది. దీనితో జార్జియా షెడ్యూల్ ను అనుకున్న సమయానికి అనుకున్న విధంగా జక్కన్న పూర్తి చేయగలడా అన్నసందేహాలు కొందరికి కలుగుతున్నాయి. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ జాతీయ స్థాయిలో పలు భాషలలో ఒకేసారి విడుదల కావలసిన సినిమా ముఖ్యంగా బాలీవుడ్ లో సినిమాల రిలీజ్ డేట్ ను చాల ముందుగా ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే రెండుసార్లు ‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఈమూవీ పై బాలీవుడ్ బిజినెస్ సర్కిల్స్ లో నమ్మకాలు తగ్గాయి అని అంటున్నారు. దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఇండస్ట్రీని కన్ఫ్యూజ్ చేస్తూ ఇదే దసరా సీజన్ ను నమ్ముకున్న ‘కేజీ ఎఫ్ 2’ ‘ఆచార్య’ ‘రాథే శ్యామ్’ ‘అఖండ’ మూవీ నిర్మాతలను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: