మనిషి తల రాత ను ఎవరు మార్చలేరు. కొందరు చేతిదాకా వచ్చిన అదృష్టాన్నికాల‌ద‌న్ను కుంటారు.. మరికొందరు చేతిదాకా వచ్చిన దరిద్రాన్ని తమకు తెలియకుండానే వదులుకుంటారు. ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ? మారుతుందో ఎవరు చెప్పలేరు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్ టి ఆర్ చేయాల్సిన మూడు సినిమాలను ఆయన వదులుకున్నారు. ఆ సినిమా దర్శకులు ఆ కథలను ముందుగా ఎన్టీఆర్‌కే చెప్పారు. అయితే ఎన్టీఆర్ కథలు నచ్చక వీటిని రిజెక్ట్ చేయడంతో ఆ దర్శకులు ఆ కథల‌ను మరో హీరోలతో చేశారు. విచిత్రమేంటంటే ఆ మూడు సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ లు అయ్యాయి. శ్రీకాంత్ అడ్డాల - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా ఎంత ఘోరమైన ప్లాప్‌ అయిందో తెలిసిందే.

ముందుగా శ్రీకాంత్ అడ్డాల ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పాడట. అయితే ఎన్టీఆర్ కథ నచ్చక చేయన‌న‌డంతో చివరకు మహేష్ ను ఒప్పించి ఈ సినిమా చేశాడు. ఈ సినిమా మహేష్ ప‌రువు గంగ‌లో కలిపేసింది. ఇక స్టార్ రైటర్ వ‌క్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అయిన నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా కథను ఎన్టీఆర్ తో చేయాలని రెండు సంవత్సరాలుగా వెయిట్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కుతోంద‌ని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఈ కథకు ఒకానొక దశలో ఎన్టీఆర్ ఓకే చెప్పడం కూడా జరిగిందని అని అంటారు.

అయితే అనూహ్యంగా బాబి జై లవకుశ కథ ఎన్టీఆర్ కు చెప్పడంతో ఆ సినిమా చేసేందుకు ఎన్టీఆర్ మొగ్గు చూపాడు. దీంతో వంశీ ఈ కథను అల్లు అర్జున్ తో చేసి డిజాస్టర్ ఇచ్చాడు. ఇక శతమానం భవతి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాను ఇచ్చిన దర్శకుడు సతీష్ వేగేశ‌న శ్రీనివాస కళ్యాణం సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కు చెప్పారు. నిర్మాత దిల్ రాజు సైతం ఈ సినిమాని తీయాలని అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ కథను తిర‌స్క‌ర‌ణ‌ చేయడం తో చివరకు నితిన్ తో చేసి ప్లాప్‌ కొట్టారు. అలా ఎన్టీఆర్ ఈ మూడు కథలను రిజెక్ట్ చేసి మూడు ప్లాప్ సినిమాలు త‌ప్పించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: