పవన్ కళ్యాణ్ ..ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రజాసేవ కే తన జీవితం అంకితం చేయడానికి రాజకీయాలోకి అడుగుపెట్టిన పవన్..ప్రస్తుతం తన ఫోకస్ సినిమాల పై పెట్టాడు. సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుని.. ఆ తరువాత తను ఫుల్ టైం రాజకీయాల మీద దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తుంది. అందుకే కొత్తగా కొత్త సినిమాలను సైన్ చేయడం లేదట. అంతేకాదు బడా డైరెక్టర్స్ స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నా..వాళ్లను రిజెక్ట్ చేస్తున్నాడట.

ఇది ఇలా ఉంటే..గత కొన్నాళ్లు గా పవన్ భార్య అన్నా లెజినొవా తన పిల్లలతో సింగపూర్ లోనే సెటిల్  అవుతుంది అనే ప్రచారం గట్టిగా సాగుతుంది. గత కొన్ని నెలలుగా రష్యాలోనే ఉంటున్న ఆమె.. పిల్లల చదువుల కోసమే ఆమె పవన్ కు దూరంగా సింగపూర్ లో సెటిల్ అవుదామని డిసైడ్ అయ్యారంటూ వార్తలు  వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో  పవన్ పిల్లలకు సంబంధించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఏపీలో ఇంగ్లీష్ మీడియం చదువును వ్యతిరేకించిన ఆయన..తన పిల్లలను మాత్రం విదేశాల్లో టాప్ స్కూల్ లో చదివించాలి అనుకోవడం ఏంత వరకు కరెక్ట్ అంటూ పవన్ ను ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. ఆయన గారి పిల్లలు మాత్రం హ్యాపీగా విదేశాల్లో ఇంగ్లీష్ విద్య అభ్యసించచ్చు..? మరీ ఏపిలో ఉండే పిల్లలు మాత్రం తెలుగు మీడియంలోనే చదువుకోవాలా..ఇదేక్కడి న్యాయం..అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

అయితే దీని పై పవన్ అభిమానులు ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పవన్ ఎప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు వద్దు అని చెప్పలేదు అని..ఇంగ్లీష్ మీడియం చదువులకి పవన్ వ్యతిరేకం కాదు అని.. పిల్లల పేరంట్స్ కే వదిలేయండి వాళ్ళు ఏ మీడియంలో చదువుకోవాల్లో అని మాత్రమే పవన్ అన్నారు అని గుర్తుచేసారు. ఊరికే పవన్ మీద లేని పోని నిందలు వేయదు అని..పనికి వచ్చే పనులు గురించి ఆలోచించమని సజిషన్స్ ఇస్తున్నారు
పవన్ అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: