సినీ నటులు రాజకీయాలలోకి రావడం దక్షిణ భారత దేశంలో కొత్త కాదు. ప్రముఖ సినీ నటుడు కొంగర జగ్గయ్య  సినీ రంగం నుంచి రాజకీయలలో ప్రవేశించిన తొలి భారతీయ్యుడిగా చరిత్క కెక్కారు. ఆయన ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి గెలుపొందారు.  ఆ తరువాత తమిళ నాట ఎం.జి రామచంద్రన్,  తెలుగు  సినీమా రంగం నుంచి నందమూరి తారక రామారావు,  కృష్ణ, శారద,  మురళీమోహన్ బాబూ మోహన్,  నగరి రోజా,  విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కోట శ్రీనివాసరావు ఇలా రాసుకుంటూ పోతే ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాలలోకి వచ్చారు.
మెగాస్థార్ గా  అభిమానుల చేత కీర్తించ బడుతున్న చిరంజీవి కూడా గతంలో కేంద్ర  మంత్రి గా పని చేశారు. అంతకు ముందు ఆయన  2008 ఆగస్టు 26 వ తేదీ ప్రజారాజ్యం పార్టి ని స్థాపించారు. 2009లో వచ్చిన సార్వత్రిక ఎన్నికలలో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లోని  294 అసెంబ్లీ సీట్లకు తన పార్టీ అభ్యర్థులను బరిలో దింపారు. వారిలో కేవలం 18 స్థానాలలోమాత్రమే విజయం దక్కించుకున్నారు. 2011 ఆయన ప్రాజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీం చేశారు.  కేంద్ర మంత్రి అయ్యారు.  ఈ ఎపిసోడ్ ను కాసేపు పక్కన పెడదాం.
 చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయక ముందు... ఓ చిత్రం ద్వారా ఆయన రాజకీయాలలోకి వస్తున్నాడు అని సంకేతాలు ఇచ్చారు. 2006 లో ఆయన  ఓ సందేశాత్మక చిత్రం స్టాలిన్ లో నటించారు. అందరినీ మెప్పించారు.  మీకు చేసిన సహాయానికి ప్రతి సహాయంగా మీరు మరో ముగ్గురికి సాయం చేయండి. వారిలో ఒక్కోక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమనండి అనే సందేశం ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.  ఈ చిత్రం భాక్సాఫీసు  రికార్జులను బద్దలు కొట్టింది. రాజకీయ వర్గాలలో సంచలనాలను రేకెత్తించింది.
ప్రజారాజ్యం పార్టీ ని చిరంజీవి స్థాపించ డానికి రెండుమూడేళ్ల ముందు నుంచే డాక్టర్ మిత్ర, పరకాల ప్రభాకర్  లాంటి కొందరు  చిరంజీవి కోసం క్షేత్ర స్థాయిలో పని చేశారు. స్టాలిన్ చిత్రం  చిరంజీవికి ఓ బ్రేక్ ను ఇచ్చింది. ఆయన  రాజకీయ జీవితానికి బాటలు వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: