ట్రిపుల్ ఆర్.. ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే..జక్కన్న సినిమాలు అంటే ఆ మాత్రం ఆత్రుత ఉంటుంది. భారీ బడ్జెట్ తో భారీ కథనం తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల లో  నటిస్తున్నారు.ఎన్టీఆర్ కొమ‌రం భీమ్ గా న‌టిస్తే.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టించారు. టీజ‌ర్ అండ్ ట్రైల‌ర్ కు మంచి స్పందన రావడం తో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.. ఖచ్చితంగా ఈ సినిమా మరో ప్రభంజనాన్ని సృష్టిస్తుందని తెలుస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.. జ‌న‌వ‌రి 7న ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ ప్లాను చేశారు.కాగా, సంక్రాంతి బరిలో మరో రెండు సినిమాలు ఉండటంతో ఈ సినిమా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం దేశంలో మళ్లీ మారుతున్న పరిస్థితులు రీత్యా ఈ సినిమా వాయిదా పడనుంది అని చక్కర్లు కొడుతోంది.. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వ్యాప్థి పెరుగుతుంది.దీని వల్ల సినిమా విడుదల తేదీ మారినట్లు తెలుస్తుంది...

మోడీ కూడా స్వీయ నిబంధనలు తీసుకొవాలని హెచ్చరిస్తున్నారు.. జనవరి నుంచి టీకా, బోస్ట‌ర్ డోస్ వేయ‌నున్న‌ట్టుగా అనౌన్స్ చేశారు.జనవరి మొదటి వారం వరకూ అలానే వుంటే మాత్రం సినిమా కలెక్షన్స్ పై భారీ ప్రభావం పడుతుంది.ఇకపోతే ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం నార్త్ లో ఇంకా ప్ర‌చారం చేస్తుంది. హైదరబాద్ లో డిసెంబ‌ర్ 31న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేయాలని ముందస్తు ప్లాన్ చెస్తుంది. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు. ఈ విషయం పై సిద్దు మంచికంటి ట్వీట్ చేశారు. చిత్రబృందం రిలీజ్ డేట్ పై ఎటువంటి క్లారిటీ రాలేదు.. అయితే సినిమా అప్పుడే విడుదల అవుతుందని రూమర్స్ ను నమ్మవద్దు అని పోస్ట్ లో పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: