కోలీవుడ్ హీరోయిన్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తనకు నటనపరంగా ప్రాధాన్యత ఇచ్చే పాత్రలోనే నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. నటుడు రాజేష్ కుమార్ శ్రీ లక్ష్మీ మేనకోడలు. తెలుగులోకి పలు డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి వరల్డ్ ఫేమస్ లవర్, నానితో కలిసి టక్ జగదీష్ తదితర సినిమాలలో నటించింది. ప్రస్తుతం డ్రైవర్ జమున అనే సినిమాలో నటిస్తున్నది.


ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కిన్ స్లిన్ దర్శకత్వంలో ఈ సినిమా ని తెరకెక్కించారు. ఇందులో ఈ ముద్దుగుమ్మ ఒక క్యాబ్ డ్రైవర్ గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది దగ్గుబాటి సురేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. ఇక దీంతో ఈ సినిమాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన జమున అనే ఒక అమ్మాయి లేడీ క్యాబ్ డ్రైవర్ గా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అలా కొనసాగిస్తున్న సమయంలో కొన్ని జరిగిన సంఘటనలు ఈ సినిమాల థ్రిల్లర్గా కనిపించనున్నాయి.


ప్రతి ఒక్క ఆడపిల్లలు కూడా డ్రైవింగ్ చేయడంలో చాలా కష్టపడుతూ ఉంటారు.. ఇక ఇలాంటి సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారో అనే విషయం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొత్తం రోడ్ మూవీగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా కోసం హీరోయిన్ ఐశ్వర్య చాలా కష్టపడినట్లుగా తెలుస్తోంది. క్యాబ్ డ్రైవర్ ఎలా ఉంటారు అలా అనుగుణంగా తనని తాను మలుచుకొనే ప్రయత్నం చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమా ఒకేసారి తెలుగు ,తమిళ ,మలయాళ కన్నడ భాషలు విడుదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: